Sai Durga Tej: నా నెక్స్ట్ టార్గెట్ ఆయనే..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన పేరుని మళ్లీ మార్చుకున్నట్లు వెల్లడించారు.. ఆయన అసలు పేరు సాయి ధరంతేజ్ కాగా మధ్యలో ధరమ్ తీసేసి దుర్గగా పేరు మార్చుకున్నారు సాయిధరమ్ తేజ్.. అమ్మ పేరు విజయ దుర్గ అయితే దుర్గా వచ్చేలా సాయి దుర్గా తేజ్ గా తన పేరును మార్చుకున్నట్టు తెలిపారు సాయిధరమ్ తేజ్ ..తాజాగా ఆయన సత్య అనే షార్ట్ ఫిలిం లో నటించిన విషయం తెలిసిందే.. సైనికుల భార్యల స్టోరీతో రూపొందిన ఈ షార్ట్ ఫిలిం ని నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకుడిగా మారి రూపొందించిన ఈ సినిమా మహిళా దినోత్సవ సందర్భంగా మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ సత్య సినిమా విశేషాలను వెల్లడించడంతోపాటు తన మామలు అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో నటించడం పై పలు కామెంట్స్ చేశారు..

సత్య షార్ట్ ఫిల్మ్ విశేషాలు..
ఇకపోతే సత్య షార్ట్ ఫిలిం గురించి చెబుతూ.. దేశభక్తి కోసం ఈ మూవీ చేసినట్టు సాయి దుర్గా తేజ్ వెల్లడించారు. సైనికుడు డ్యూటీ కోసం బోర్డర్ కి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న మహిళ పడే ఇబ్బందులు, క్షోభ , అవమానాలు ఎలా ఉంటాయనేది తెలియజేసే ఉద్దేశంతో ఈ మూవీ చేసినట్టు వెల్లడించారు. దీంతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నవీన్ విజయ్ కృష్ణ ప్రతిభను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంలో ఈ షార్ట్ ఫిలిం చేశామని.. అంతే కాదు ఈ షార్ట్ ఫిలింతో తాను కూడా ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతున్నానని ప్రకటించారు సాయి దుర్గా తేజ్ . ఇకపోతే తన అమ్మ పేరుతోనే విజయ దుర్గా ప్రొడక్షన్స్ ని స్థాపించినట్టు తెలిపారు.

నెక్స్ట్ టార్గెట్ ఆయనే..
ఈ నేపథ్యంలోనే చిరంజీవి , పవన్ కళ్యాణ్, నాగబాబులతో నటించడం పై కామెంట్లు చేశారు.. సాయి దుర్గా తేజ్ ప్రెస్ మీట్ లో భాగంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు.. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ చేశారు కదా.. మరి మీ ఫ్యామిలీలో రామ్ చరణ్ తో లేదా ఇంకెవరితోనైనా మల్టీ స్టారర్ చేస్తారా? అని ఒక మీడియా ప్రతినిధి అడగగా.. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. ఆల్రెడీ నాగబాబు, పవన్ కళ్యాణ్ మామలతో కలిసి నటించాను.. ఇక నా నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి మామ.. ఆయనతో కలిసి నటించాకే మిగిలిన వాళ్ళతో కలిసి నటిస్తాను అంటూ స్పష్టం చేస్తారు.

- Advertisement -

మెగా హీరోలతో సాయి తేజ్..
సాయి దుర్గా తేజ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. జవాన్ సినిమాలో నాగబాబు – సాయి దుర్గా తేజ కలిపి నటించగా.. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ – సాయి దుర్గా తేజ్ కలిసి నటించారు.. మరి చిరంజీవితో ఈయన ఏ సినిమాలో కనిపిస్తారో చూడాలి.. మొత్తానికి అయితే ఈసారి తన మామ చిరంజీవి నెక్స్ట్ టార్గెట్ అంటూ కామెంట్లు చేసిన సాయి దుర్గా తేజ్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.. అంతేకాదు చిరంజీవితో చేసే సినిమా భారీ సక్సెస్ అందుకోవాలని ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు