Aishwarya Rajinikanth : ఎప్పుడూ ఎవరో ఒకరిపై నిందలు వేయడమే ఈమె పనా?

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా, సూపర్ స్టార్ రజనీకాంత్ వారసురాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కానీ ఆమె చేసే కొన్ని పనులు మాత్రం రజిని అభిమానులను తెగ చిరాకు పెడుతున్నాయి. ముఖ్యంగా తన ఫెయిల్యూర్ కి ఇంకొకరిని బాధ్యులను చేయడం వాళ్లకు నచ్చడం లేదు. రీసెంట్ గా “లాల్ సలామ్” మూవీ ప్లాఫ్ అవ్వడానికి కారణం రజనీకాంత్ అంటూ ఆ డిజాస్టర్ ను తండ్రిపై రుద్దేసిన ఐశ్వర్య తీరుపై మూవీ లవర్స్ మండిపడుతున్నారు. ఆమె ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. మరి ఇంతకీ ఐశ్వర్య “లాల్ సలామ్” విషయంలో చేసిన కామెంట్స్ ఏంటి? ఇంతకుముందు ఈమె బ్లేమ్ చేసిన సెలబ్రిటీ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

“లాల్ సలామ్” రజినీకాంత్ వల్లే డిజాస్టర్…
ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన “లాల్ సలామ్” మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. రజనీకాంత్ గెస్ట్ రోల్ చేశారు. సినిమాలో రజనీకాంత్ పాత్ర కేవలం 30 నిమిషాల లోపే ఉన్నప్పటికీ ఆయన పేరునే ప్రమోషన్స్ లో ఎక్కువగా వాడుకున్నారు. కానీ తీరా సినిమా చూస్తే అందులో రజనీకాంత్ పాత్రకు సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్ల అభిమానులు గంపగుత్తగా ఈ మూవీని తిరస్కరించారు. అయితే “లాల్ సలామ్” మూవీ రిజల్ట్ పై డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ లో చేసిన మార్పుల వల్లే తాము అనుకున్నారు రిజల్ట్ రాలేదని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ప్రమోషన్స్ వల్ల రజనీకాంత్ సినిమా అన్నట్టుగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయిందని, కానీ సినిమాలో ఆయన కేవలం అతిథి పాత్ర కావడం ప్రేక్షకులకు నచ్చలేదని ఐశ్వర్య కామెంట్స్ చేసింది.

ఐశ్వర్య అభిప్రాయం…
వాస్తవానికి ముందుగా తాను రాసుకున్న కథలో రజనీకాంత్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని, కానీ ఆ తర్వాత సినిమా కథలో చాలా మార్పులు చేశామని వెల్లడించింది. రజనీకాంత్ కోసం సెకండ్ హాఫ్ వరకు ఫ్యాన్స్ వేచి చూడడం కష్టం అని అనిపించడంతో రిలీజ్ కి కొద్ది రోజుల ముందు రజినీకాంత్ క్యారెక్టర్ ను మార్చేసామని ఈ సందర్భంగా ఐశ్వర్య చెప్పుకొచ్చింది. కథలో ఆయన పాత్ర మరీ చిన్నగా ఉంటే అభిమానులు డిసప్పాయింట్ అవుతారని భావించడమే అందుకు కారణమని, అందుకే ఫస్ట్ హాఫ్ లోనే రజిని పాత్రను పరిచయమయ్యేలా ఎడిట్ చేశామని ఐశ్వర్య అసలు విషయాన్ని బయటపెట్టింది. అలాగే సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ క్యారెక్టర్ లెంత్ పెంచామని వెల్లడించింది. దీనివల్ల ఆయన పాత్ర కోసం కథకు సంబంధం లేని చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించాల్సి వచ్చిందని, ఈ అదనపు హంగుల కారణంగా కథ వీక్ అయిపోయిందని ఐశ్వర్య అన్నది. అలాగే కథతో పాటే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ కూడా తను అనుకున్నట్టుగా కాకుండా మరో రకంగా మారిపోయిందని తెలిపింది. అయితే ఈ మార్పులు అన్ని రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందు చేయాల్సి రావడం సినిమా ఫెయిల్యూర్ కు మరో రీజన్ అని ఐశ్వర్య వెల్లడించింది. సినిమా రిజల్ట్ కు తన తండ్రిని బాధ్యుడిని చేస్తూ ఐశ్వర్య చేసిన కామెంట్స్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

- Advertisement -

ఇదే మొదటిసారి కాదు…
ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమాతో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకురాలిగా పరిచయం అయింది. ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకున్నప్పటికీ ధనుష్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్ కారణంగా కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో త్రీ మూవీ ప్లాఫ్ కావడానికి కారణం అనిరుధ్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ పై తోసేసింది ఐశ్వర్య. అనిరుధ్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా “వై దిస్ కొలవెరి” సాంగ్ సినిమాపై తాము అనుకున్న యాంగిల్ లో కాకుండా డిఫరెంట్ గా అంచనాలు పెంచేసిందని, కానీ కథ వేరేగా ఉండడంతో డిజాస్టర్ అయిందని కామెంట్స్ చేసింది. దీంతో తన ఫెయిల్యూర్ కు మరొకరిని బాధ్యులను చేయడమే ఐశ్వర్య రజనీకాంత్ పనా ఏంటి? తండ్రి పరువు తీస్తోంది అంటూ మండిపడుతున్నారు రజిని ఫ్యాన్స్. ఇక ఆ తర్వాత వాయ్ రాజా వాయ్, లాల్ సలామ్ సినిమాలు చేసింది ఐశ్వర్య.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు