Kumari Aunty : పాపులర్ సీరియల్ లో ఛాన్స్ కొట్టేసిన కుమారీ ఆంటీ… వీడియో వైరల్

ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులర్ అయిపోయిన కుమారి ఆంటీకి ఈమధ్య లక్ మామూలుగా కలిసి రావడం లేదు. బుల్లితెరపై పలు షోలతో పాటు సీరియల్ అవకాశాలు కూడా పలకరిస్తున్నాయి. తాజాగా కుమారి ఆంటీ ఓ పాపులర్ సీరియల్ లో కనిపించగా, దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ కుమారి ఆంటీ నటించిన ఆ సీరియల్ ఏంటి? అందులో ఆమె పాత్ర ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

ట్రోలింగ్సే వరంగా…
కుమారి ఆంటీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ పలు వివాదాలకు, ట్రోలింగ్ కు కారణం కూడా అయింది. ఆమె చెప్పిన థౌజండ్ రుపీస్, రెండు లివర్లు ఎక్స్ట్రా” అనే డైలాగ్ సోషల్ మీడియాలో మోత మోగించింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆమె విషయంలో జోక్యం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకానొక సందర్భంలో ఆమె కొచ్చిన క్రేజ్ వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడడంతో, ట్రాఫిక్ పోలీసులు ఫుడ్ స్టాల్ తీసేయాలంటూ కుమారి ఆంటీకి వార్నింగ్ ఇచ్చారు. ఆ టైంలో పలువురు సినీ సెలబ్రిటీలు ఇది అన్యాయం అంటూ ఆమెకు అండగా నిలిచారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఆమె ఫుడ్ స్టాల్ ను ఆమెకే దక్కేలా చేశారు. దీంతో కుమారి ఆంటీ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియాలో రోడ్ సైడ్ చిన్న ఫుడ్ బిజినెస్ నడుపుతున్న ఆమె దగ్గర ఫుడ్ కోసం జనాలు పోటెత్తడం మొదలు పెట్టారు. ఇప్పుడు కుమారి ఆంటీకి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి బుల్లితెర మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాము నిర్వహించే షోలలో, సీరియల్స్ లో ఆమెకు చిన్నచిన్న రోల్స్ ఆఫర్ చేస్తున్నారు.

సీరియల్ లో కుమారి ఆంటీ…
రీసెంట్ గా స్టార్ మాలో జరిగిన బిగ్ బాస్ ఉత్సవంలో కుమారి ఆంటీ కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ షోలో బిగ్ బాస్ సెలబ్రిటీలకు ఆమె స్వయంగా భోజనం వడ్డించింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీతో సహా మరికొన్ని షోలలో మెరిసింది. తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే సీరియల్ లో మరో పాత్రను దక్కించుకుంది. దీనికి సంబంధించి తాజాగా రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఇంతకీ కుమారి ఆంటీ ఈ సీరియల్ లో జస్ట్ గెస్ట్ గా కనిపించిందా? లేదంటే పూర్తిస్థాయి పాత్ర చేస్తుందా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సీరియల్ ప్రోమోతో మరోసారి కుమారి ఆంటీ పేరు మరోసారి మార్మోగిపోతోంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న కుమారి ఆంటీ త్వరలోనే సినిమాల్లోకి అడుగు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను విజిట్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు మరింత రష్ పెరిగింది.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు