Naga vamsi : సంక్రాంతికి మీడియా డిసప్పాయింట్ అయింది మేం కాదు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ఉన్న హైప్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా కాంబినేషన్స్ పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటిలో కొన్ని కాంబినేషన్స్ పరిశీలిస్తే రాజమౌళి- ఎన్టీఆర్, త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ – రవితేజ, బోయపాటి శ్రీను – బాలకృష్ణ, గోపీచంద్ మలినేని -రవితేజ ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. వీటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు కమర్షియల్ గా థియేటర్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. కాంబినేషన్లో మూడవ సినిమాగా వచ్చింది గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకొని కూడా విజయవంతంగానే కొనసాగింది.

త్రిపుర శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అతడు. ఒక క్రిమినల్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న ఒక ఇంటికి వస్తే అసలు బంధాలు అంటే ఏంటి, కుటుంబ సభ్యులు వారి మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయి అని ఒక క్రిమినల్ కి తెలియడమే ఈ కథ యొక్క మెయిన్ స్టోరీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు నటించిన విధానం, త్రివిక్రమ్ డైలాగ్స్, నటీనటులు పర్ఫామెన్స్ అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా థియేటర్ వద్ద కమర్షియల్ గా ఊహించిన విజయాన్ని సాధించలేదు కానీ ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ను నమోదు చేసుకుంటుంది.

- Advertisement -

త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ఖలేజా. దేవో మనుష్య రూపేనా అని సంస్కృతంలోని ఒక లైన్ ని తీసుకొని ఇన్స్పైర్ అయి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని చేశాడు. ఈ సినిమా కూడా థియేటర్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పటికీ టీవీలో వస్తున్న ప్రతిసారి కూడా మంచి ప్రజాధరణం పొందుకుంటుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన హిట్ చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. చాలామంది ఈ సినిమాను అప్పట్లో అర్థం చేసుకోలేకపోయారు.

ఇకపోతే ముందు రెండు సినిమాల ఈ సినిమా కాకూడదని చెప్పి సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను ముందు నుంచే ఇదొక ప్రాపర్ కమర్షియల్ సినిమా అంటూ ప్రోమోసన్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా పైన కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. ఇకపోతే మూడోసారి ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో అంచనాలు పెంచుకుని థియేటర్ కి వెళ్లారు. అయితే వెళ్లిన ఆడియోస్ అందరూ కూడా ఇది ఒక మాస్ కమర్షియల్ సినిమా అంటూ ఫిక్స్ అయ్యారు.

కానీ థియేటర్ కి వెళ్లి తర్వాత చూస్తే ఇదొక ప్రాపర్ త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ సినిమా అని అర్థమైంది. మదర్ సెంటిమెంట్ అన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ చూసే మైండ్ సెట్ ఆ క్షణానికి కరెక్ట్ గా లేకపోవడం వలన ఈ సినిమాకి సంబంధించిన నెగటివ్ టాక్ బయటకు వచ్చేసింది. అప్పట్లో కొంతమంది మీడియా ప్రముఖులు కూడా ఈ సినిమాకి తక్కువ రేటింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఈ సినిమా అయితే మాత్రం బాగానే నిలబడి మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది.

రీసెంట్ గా ఇదే విషయాన్ని నాగ వంశీ నుంచి ప్రస్తావిస్తూ వచ్చాడు. ఒక సినీ జర్నలిస్ట్ సంక్రాంతికి డిసప్పాయింట్ అయ్యారు అని అనగానే, సంక్రాంతికి మీడియా డిసప్పాయింట్ అయింది మేము డిసప్పాయింట్ అవ్వలేదు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు నాగ వంశీ. అయితే గుంటూరు కారం సినిమా గురించి నాగ వంశీ రిలీజ్ ముందు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో, రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు