Allu Arjun: ఆంధ్రాలో మల్టీప్లెక్స్.. ఎక్కడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ఎక్కువగా బిజినెస్ వైపుగా అడుగులు వేస్తూ భారీగానే సంపాదిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా క్లాత్ , ఫుడ్ , థియేటర్ బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా థియేటర్ బిజినెస్ లు బాగా ఊపందుకుంటున్నాయి.. స్టార్ హీరోలు సైతం ఈ వైపు గానే అడుగులు వేస్తూ ఉన్నారు.. ఇప్పటికే మహేష్ బాబు , అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా పెద్ద నగరాలలో మల్టీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు..

మల్టీప్లెక్స్ నిర్వహిస్తున్న స్టార్స్..

ఇప్పటికే అల్లు అర్జున్ కు AAA, మహేష్ బాబుకు AMB, విజయ్ దేవరకొండ VD అనే పేర్లతో హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్ లు నిర్వహిస్తున్నారు .. త్వరలోనే వీరి జాబితాలో రవితేజ కూడా చేరిపోయారు.. త్వరలో ఒక భారీ మల్టీప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాగే ఏషియన్ సంస్థతో కలిసి ART అనే ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మించబోతున్నారట.. ఇకపోతే ఇప్పటివరకు హైదరాబాదులో అల్లు అర్జున్ AAA పేరుతో పెద్ద మల్టీప్లెక్స్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మరొక మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసి తన బిజినెస్ ను మరింత విస్తరింప చేసుకునేందుకు పలు రకాల ప్రణాళికలు కూడా చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రాలో కూడా AAA మల్టీప్లెక్స్ థియేటర్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

వైజాగ్ లో కొత్త మల్టీప్లెక్స్..

ఇందుకోసం వైజాగ్లో కొత్తగా కడుతున్న ఇనార్బట్ మాల్ లో ఏసియన్ సంస్థతో కలిసి హైదరాబాదులో ఉన్నట్టుగా AAA ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త వినిపిస్తోంది.. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలుబడలేదు.. ఇటీవలే పుష్ప-2 సినిమా షూటింగ్ కు వెళ్లగా విపరీతంగా అభిమానులు రావడంతో అల్లు అర్జున్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్ సినిమాలు..

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సినిమా సక్సెస్ కావడంతో పుష్ప-2 ను మరింత పకడ్బందీగా సుకుమార్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్గా రష్మిక నటిస్తోంది.. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తూ ఉండగా అనసూయ , సునీల్, ఫహద్ ఫాజిల్ వంటి వారు కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు.. మరి వైజాగ్లో నిర్మించబోతున్నటువంటి AAA మల్టీప్లెక్స్ థియేటర్ గురించి అల్లు అర్జున్ స్వయంగా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మొత్తానికైతే అటు హైదరాబాదులో ఇటు వైజాగ్ లో మల్టీప్లెక్స్లను నిర్వహిస్తూ భారీగా సంపాదన పొందే ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్.. ఏదేమైనా వీరి టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు