Naga Vamsi: అందుకే థమన్ ను పక్కన పెట్టాం

థమన్ రీసెంట్ టైమ్స్ లో తమను ఇచ్చిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలియదు కాదు. అయితే ముందు చాలా సినిమాలకు సంగీతం వహించిన థమన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత మంచి పేరును సాధించుకున్నాడు. అయితే థమన్ కెరియర్లో ఆ సినిమా 100వ సినిమా. ఆ తర్వాత తమన్ కెరియర్ తిరుగులేకుండా ముందుకెళ్ళింది.

థమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కిక్ సినిమాతో మొదలైన థమన్ జర్నీ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలను పూర్తిచేసే విధంగా సాగింది. చాలా స్పీడ్ గా 50 సినిమాలను కూడా పూర్తి చేసేసాడు. అయితే ఒక టైంలో థమన్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టడం మొదలైంది. అలానే థమన్ చేసిన ఆల్బమ్స్ లో బెస్ట్ ఆల్బమ్స్ కూడా ఉన్నాయి.
సిద్ధార్థ్ చేసిన లవ్ ఫెయిల్యూర్, వైశాలి, తొలిప్రేమ వంటి సినిమాలు థమన్ మంచి పేరును తీసుకొచ్చాయి.

ఇక అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలన్నిటికీ సంగీతం అందించాడు. అరవింద సమేత వీర రాఘవ సినిమాకి మొదట అనిరుద్ సంగీతం అందించాల్సి ఉంది. కానీ అప్పటికే అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అవ్వడంతో అనిరుధ్ ప్లేసులో థమన్ ను తీసుకున్నాడు త్రివిక్రమ్.

- Advertisement -

ఇకపోతే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలు అన్నిటికీ కూడా థమన్ సంగీతం అందించాడు. దీని కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పొచ్చు. అలానే సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా కొన్ని సినిమాలుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించాడు. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అయితే ఆ బ్యానర్లో వచ్చిన డీజే టిల్లు సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు ఎస్ఎస్ థమన్.

ఇప్పుడు మళ్లీ అదే బ్యానర్ టిల్లు స్క్వేర్ సినిమా రాబోతుంది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం టిల్లు హిట్ అవడం. మార్చ్ 29న వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు థమన్ చేయట్లేదు. దీనికి కారణాలు ఇవి అంటూ వేర్వేరు కథనాలు బయటికి వచ్చాయి అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగ వంశీ.

థమన్ కి ఉన్న బిజీ షెడ్యూల్స్ వలన ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయలేదని. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడడంతో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థమన్ ప్లేస్ లో భీమ్స్ ను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు నాగ వంశీ. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో భీమ్స్ మాత్రం ప్రూవ్ చేసుకుంటే, ఇక థమన్ ప్లేస్ ని భర్తీ చేసి తనకంటూ ఒక పర్ఫెక్ట్ కెరియర్ భీమ్స్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు