Sudha Kongara : ఇంకొంచెం టైం కావాలి

హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో సూర్య కూడా మంచి మార్కెట్ ఉంది. సూర్య చేసిన ఎన్నో సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ లభించింది. సూర్య నటించిన గజినీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. ఈ సినిమాకి హరీష్ జయరాజ్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ చాలామంది ఈ పాటలను పాడుకుంటారు.

సూర్య సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గా సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. అయితే ఈ రిలీస్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు అని చెప్పొచ్చు. చాలామంది ఈ సినిమాకు హాజరై ఈ సినిమాను ఒక కన్సర్ట్ గా మార్చారు. చాలామంది తమిళ్ హీరో కంటే కూడా ముందుగా సూర్య అనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం.

ఇక సూర్య తమ్ముడు కార్తీ గురించి అయితే మనకు తెలిసిందే. తమిళ్ ప్రేక్షకులు కంటే కూడా తెలుగు ప్రేక్షకులే తనకు బాగా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కార్తీ. కార్తీక్ సినిమాలు కూడా ఇక్కడ ఆడియన్స్ అద్భుతంగా ఆదరిస్తారు. ఇకపోతే సూర్య నటించిన రీసెంట్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేదు.

- Advertisement -

కరోనా టైంలో సూర్య నటించిన ఎన్నో అద్భుతమైన సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నీ కూడా మంచి రెస్పాన్స్ ను సాధించుకున్నాయి. అందులో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా మంచి హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవ్వటమే కాకుండా ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా విషయంలో అందరికీ ఒక అసంతృప్తి ఉంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయి ఉంటే బాగుండేదని చాలామంది ఫీలయ్యారు.

అందుకే మీరు కాంబినేషన్లో ఇప్పుడు వస్తున్న సినిమా కోసం చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి పురాణానూరు అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే ఈ సినిమా 2024 లోనే రిలీజ్ అవుతుందని చాలామంది భావించారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలో ఈ సినిమా వచ్చేటట్లు లేదు అని తెలుస్తుంది.

రీసెంట్ గా ఈ మూవీ టీం నుంచి ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. “పురాణానూరు సినిమాకి ఇంకొంచెం టైం కావాలని, ఈ కాంబినేషన్ చాలా స్పెషల్ అని, బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని త్వరలో ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తామంటూ చెప్పుకొచ్చింది ఈ చిత్ర యూనిట్” ఈ అధికారిక ప్రకటనతో సూర్య ఫ్రెండ్స్ కొద్దిపాటి నిరాశకు గురయ్యారు అని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు