Suriya: సూర్యతో రొమాన్స్ కి సిద్ధమైన బాలీవుడ్ నటి.. బడ్జెట్ ఎన్ని కోట్లంటే..?

ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తమిళ చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరో సూర్య తన చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈయన..వరుస సినిమాలు ప్రకటిస్తూ అటు తెలుగు ఇటు తమిళ్ ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే మరొకవైపు తన భార్య ప్రముఖ హీరోయిన్ జ్యోతిక నిర్మిస్తున్న చిత్రాలలో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలు అన్నీ కూడా భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి.

ఇకపోతే సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కంగువ.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అన్నీ కూడా కంగువా చిత్రంపై సర్వత్ర ఆసక్తి నెలకొల్పుతున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్గా నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయింది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరొకవైపు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు సూర్య. దీనితోపాటు వెట్టిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో కూడా నటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అలాగే బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో కూడా నటించడానికి సూర్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈయన భారత ఇతిహాసాన్ని రూ .500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే మహాభారతం చిత్రంలో సూర్య ఏ పాత్ర పోషించబోతున్నారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక ఇందులో ఆయనకు జోడిగా అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం.

- Advertisement -

అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న ఈమె.. ప్రస్తుతం టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు – రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న మహాభారత చిత్రంలో జాన్వీ కపూర్ చోటు దక్కించుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు