Aamani : చిరు కోసం 10 సార్లు అడుక్కున్నారు.. అయినా నో ఛాన్స్..!

Aamani : 90వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది నటీమణులలో ఆమని కూడా ఒకరు.. జంబలకడిపంబ, శుభలగ్నం, మావిచిగురు , మిస్టర్ పెళ్ళాం వంటి సూపర్ హిట్ చిత్రాలతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.. చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె.. తన కెరియర్ కి ఎటువంటి డోకా లేకుండా ముందుకు సాగుతోంది. ఇక తన డ్రీం హీరో మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రాలేదని.. గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు అదే చిరంజీవితో నటించే అవకాశం వస్తే మాత్రం నో అని చెబుతోంది.. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చిరుకి అక్కగా..

చిరంజీవితో నటించే అవకాశం వస్తే ఆ పాత్రను రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని చెబుతూ.. చిరంజీవికి అక్కగా నటించే అవకాశం వచ్చింది.. ఆ మూవీ మరేదో కాదు మరుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్.. ఈ చిత్రంలో చిరంజీవికి అక్కగా నటించాలని.. ముందుగా నన్ను అడిగితే.. నా డ్రీమ్ హీరో.. కలలో కూడా చిరంజీవిని నా తమ్ముడిగా ఊహించుకోలేను. అందుకే పది సార్లు ఫోన్ చేసి అడుక్కున్నా సరే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసాను అంటూ ఆమని కామెంట్లు చేసింది. ఇక ఆమని స్టాలిన్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఆ పాత్రలో ఖుష్బూ నటించిన విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో ఖుష్బూ , చిరు అక్కాతమ్ముళ్లు గా నటించారు ..ఆయనతో హీరోయిన్గా ఛాన్స్ రాకపోయినా పర్వాలేదు కానీ సిస్టర్ పాత్రలో మాత్రం నటించను అని తెలిపింది ఆమని.. మొత్తానికైతే తన డ్రీమ్ హీరో తన డ్రీమ్ హీరోలానే ఉండిపోవాలని.. ఆయనపై అభిమానాన్ని చాటుకున్నది.

చిరంజీవితో నటించే అవకాశం..

ఇకపోతే ఈ అవకాశం కంటే ముందే మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రాకరాక వస్తే అది కాస్త మరో హీరోయిన్ వల్ల చేజారిపోయింది.. రిక్షావోడు చిత్రంలో ముందుగా నన్నే అనుకున్నారు.. అయితే ఆ తర్వాత ఆ చిత్రంలో సౌందర్య ను తీసుకోవడం జరిగింది.. ఇక అక్కడ చిరంజీవి పక్కన చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు సంతోషంగా అనిపించింది. అయితే సడన్గా ఒక రోజు పేపర్లో నగ్మాని హీరోయిన్గా తీసుకున్నారని చదివాను.. ఇక మా మేనేజర్ ని అడిగితే అవును మనకి ఛాన్స్ లేదు.. డైరెక్టర్ మారారు.. అందుకే ఆమెను తీసుకున్నారు అని చెప్పారు.. ఇక ఆ చిత్రానికి ముందుగా డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహిస్తారని.. నన్ను హీరోయిన్గా తీసుకుంటామని చెప్పారు.. అవకాశం చేజారిపోయింది ఇక కొన్ని కారణాలవల్ల ఆయన కూడా మరో చిత్రానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో కోడి రామకృష్ణ రిక్షావోడు చిత్రాన్ని డైరెక్ట్ చేశారు… అలా ఈ సినిమాలో నటించే అవకాశం కూడా పోయింది అంటూ ఆమని తెలిపింది… ఇక చిరంజీవితో నటించే అవకాశం కోల్పోవడంతో వెక్కివెక్కి ఏడ్చాను. అది నాకు హార్ట్ బ్రేకింగ్ లాంటిది అంటూ తెలిపింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు