Siddharth – Aditi Rao Hydari Marriage : షూటింగ్ కాదు పెళ్లే… లీక్ చేసిన హోస్ట్

Siddharth – Aditi Rao Hydari Marriage : తమిళ హీరో సిద్ధార్థ్, హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అన్న వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోని అది పెళ్లి కాదని, సినిమా షూటింగ్ అని రూమర్లు మొదలయ్యాయి. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేక షూటింగ్ జరిగిందా అనే కన్ఫ్యూజన్ లో పడిపోయారు సినీ ప్రియులు. వాళ్ళ కన్ఫ్యూజన్ కు తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో ఓ హోస్ట్ లీక్ చేసిన వార్తతో ఫుల్ స్టాప్ పడింది. మరి ఇంతకీ ఆ హోస్ట్ ఎవరు? సిద్ధార్థ్, అదితి రావుల పెళ్లి నిజమా? లేకపోతే సినిమా షూటింగా? అనే వివరాల్లోకి వెళ్తే…

షూటింగ్ కాదు పెళ్లే…

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి గత మూడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. మహాసముద్రం మూవీ టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ లవ్ బర్డ్స్ గురించి చాలాసార్లు రూమర్లు వైరల్ అయ్యాయి. వాటికి బలం చేకూర్చే విధంగా ఇద్దరూ కూడా చాలా పార్టీలకు వెకేషన్ లకు కలిసే వెళ్లారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇన్ డైరెక్ట్ గా తమ రిలేషన్షిప్ గురించి హింట్ ఇచ్చారు. తాజాగా ఈ సెలబ్రిటీ కపుల్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సిద్ధార్థ్, అదితి మార్చి 27న తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురం రంగనాథ స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే పెళ్లి గురించి ఇంకా సిద్ధార్థ, అదితి స్పందించలేదు. కానీ తాజాగా జరిగిన హీరామండి ఈవెంట్ లో హోస్ట్ అసలు విషయాన్ని బయట పెట్టారు. అదితి రావు హైదరి ప్రధాన పాత్ర పోషించిన హీరామండి సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కు సంబంధించిన ఈవెంట్ మార్చి 27న రాత్రి జరిగింది. దీనికి స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తుండగా, ఈవెంట్ లో అదితి రావు హైదరి పెళ్లి విషయం గురించిన ప్రస్తావన తెరపైకి వచ్చింది. హోస్ట్ సచిన్ కుంభర్ మాట్లాడుతూ “హీరామండిలో అదితి కూడా ఒక ముఖ్యమైన భాగమని, మార్చ్ 27న ఆమె వివాహం చేసుకున్న కారణంగానే ఈవెంట్ కు రాలేకపోయిందని తెలిపారు. దీంతో సిద్ధార్థ, అదితి పెళ్లి (Siddharth – Aditi Rao Hydari Marriage) నిజమేననే క్లారిటీ వచ్చేసినట్టు అయింది. ఇక వీరిద్దరికి ఇది రెండవ పెళ్ళి కావడం గమనార్హం.

సిద్ధార్థ, అదితి రావు సినిమాల విషయానికొస్తే… బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ “హీరామండీ : ది డైమండ్ బజార్”. ఇందులో అదితి రావుతో పాటు మనిషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, షార్మిన్ సెగల్, సంజిత షేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1940ల బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో మే 1న స్ట్రీమింగ్ కాబోతోంది. సిద్ధార్థ్, అదితి ఇంకా తమ పెళ్లి గురించి స్పందించలేదు. కానీ అదితి రావు సోషల్ మీడియా వేదికగా “హీరామండి” గురించి ఓ సపరేట్ పోస్ట్ చేసింది. మరోవైపు సిద్ధార్థ “ఇండియన్ 2″లో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు