Siddharth – Aditi : సిద్ధార్థ్, అదితి మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా?

Siddharth – Aditi : లవర్ బాయ్ సిద్ధార్థ్, హైదరాబాది హీరోయిన్ అదితి రావు హైదరి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. గత మూడు ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు సీక్రెట్ గా వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయ్యారు. మార్చ్ 27న తెలంగాణలోని వనపర్తిలో ఉన్న రంగనాయక స్వామి ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ లవ్ బర్డ్స్ పర్సనల్ లైఫ్ గురించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ చర్చకు దారి తీసింది. మరి ఇంతకీ సిద్ధార్థ, అదితి (Siddharth – Aditi) మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంత? అంటే…

సిద్ధార్థ్ – అదితి రావు మధ్య ఇంత వయసు వ్యత్యాసమా?

1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించింది అదితి. మరోవైపు సిద్ధార్థ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో పుట్టాడు. ప్రస్తుతం అదితి వయసు 37 సంవత్సరాలు కాగా, సిద్ధార్థ్ వయసు 44 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 7 ఏళ్ల వ్యత్యాసం ఉందన్న మాట. ఈ కాలంలో ఇంత ఏజ్ గ్యాప్ తో అది కూడా సెలబ్రిటీలు పెళ్ళి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ లవ్ బర్డ్స్ గురించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే వీరిద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్. సిద్ధార్థ్ గతంలో తన చిన్ననాటి స్నేహితురాలైన మేఘన నారాయణన్ ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ మొదటి పెళ్లి 2003లో జరగగా, 2007లో డివోర్స్ తీసుకున్నారు. మరోవైపు అదితి సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. హీరోయిన్ గా కెరీర్ లో స్టార్ట్ చేసిన మొదట్లోనే ఆమె వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసింది. 2013లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. గతేడాదే సత్యదీప్ మిశ్రా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కుమార్తె మాసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. మసాబా ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్నారు. అలా డివోర్స్ అనంతరం అదితి, సిద్ధార్థ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ఈ నేలకు మళ్ళీ రెండవ పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

షూటింగ్ అయితే కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? రంగనాయక స్వామి ఆలయంలో జరిగేదంతా షూటింగ్ అని ముందుగా చెప్పారట. ఈ పెళ్లిని తమిళనాడుకు చెందిన పూజారులే దగ్గరుండి జరిపించగా, హిందూ సాంప్రదాయంలో పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లయ్యేదాకా స్థానిక పూజారులను కూడా కనీసం ఆలయంలోకి అనుమతించలేదని సమాచారం. ఒకవేళ షూటింగ్ పెళ్లయితే అక్కడ ఈ లవ్ బర్డ్స్ ఫ్యామిలీ ఏం చేస్తుంది? అదితి రావు హైదరి తల్లి విద్యా రావు వనపర్తి సంస్థాన చివరి రాజు జే రామేశ్వరరావు కూతురు. ఈ పెళ్లికి జే రామేశ్వరరావు వారసులు జే కృష్ణదేవరావు కుటుంబం హాజరైంది. పెళ్లికి సంబంధించిన డెకరేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అదితి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ హీరామండి టైటిల్ రిలీజ్ ఈవెంట్లో హోస్ట్ కూడా అదితి, సిద్ధార్థ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. పెళ్లి కారణంగానే ఆమె ఈవెంట్ కు హాజరు కాలేదని స్పష్టం చేశారు. మరి సిద్ధార్థ, అదితి తమ పెళ్లి విషయాన్ని ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు