Adithi: సముద్రం కలిపిన బంధం

దేవుడు చేసిన మనుషులలా సముద్రం కలిపిన బంధం ఏమిటి అనుకుంటున్నారా.? ఎస్ మీరు అనుకున్నది నిజమే, ఆ బంధాన్ని మాములు సముద్రం కలపలేదు, మహా సముద్రం కలిపింది.
ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుంది. RX100 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి తన మొదటి సినిమాతోనే మంచి అందుకున్నాడు. ఆ తరువాత సిద్దార్థ్ అండ్ శర్వానంద్ హీరోగా మహా సముద్రం అనే సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా అనుకున్న విజయాన్ని అందించలేదు.

కానీ మహాసముద్రం సినిమాలో నటించిన అదితిరావ్ హైదరి మరియు లవర్ బాయ్ సిద్దార్థ్ మధ్య ఏదో నడుస్తుంది అని వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. వీటికి తోడు వీరి ఇరువురు మార్లు మీడియాకి చిక్కడం వలన ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. మొత్తానికి ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు కలిసి చేసిన ఇంస్టాగ్రామ్ రీల్ ఇప్పుడు ఇంకొన్ని వార్తలకు దారి తీసింది.

గతంలో సిద్దార్థ్ పై ఇలాంటి అనేక కథనాలు వచ్చాయి, శృతి హాసన్ మరియు సమంతతో కొన్నేళ్లు ప్రేమాయణం సాగించాడు అని ఆ వార్తల సారాంశం. రీసెంట్ గా అదితి మరియు సిద్దార్థ్ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు తెలుస్తోంది.రీసెంట్ బాలయ్య అన్ స్టాపబుల్ షో లో యంగ్ హీరో శర్వాకు ఇదే ప్రశ్న ఎదురైతే చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఏదేమైనా వీరి మధ్య బంధం ఏమిటో వీరే చెబితే కానీ కొన్ని కథనాలకు బ్రేక్ పడదు.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు