Sreeleela: మరో క్రేజి ఛాన్స్

పెళ్లిసందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకున్నా ప్రస్తుతం శ్రీలీల చేతిలో దండిగా అవకాశాలు ఉన్నాయి. తాజాగా రవితేజ ధమాకా సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా మెరిసింది. దీనిలో ఈమె నటనకు, అందానికి, మాస్ డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో కొత్త సినిమాలకు శ్రీలీల మొదటి ఆప్షన్ లా కనిపిస్తోంది.

ఇప్పటికే శ్రీలీల చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న SSMB28 మూవీతో పాటు, నితిన్ తో వక్కంతం వంశీ మూవీ, బాలయ్య 108 మూవీ, రామ్ తో బోయపాటి తీస్తున్న మూవీ, నవీన్ పొలిశెట్టి తో అనగనగా ఒక రాజు, పంజా వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా ఇలా వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

కేవలం ఇవి మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో ఈ భామ పవన్ సరసన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల నటించనున్నట్లు విశ్వనీయవర్గాల సమాచారం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు