Prithviraj Sukumaran : ప్రభాస్ ను అస్సలు సహాయం అడగకూడదు.. పృథ్వీరాజ్..!

Prithviraj Sukumaran : పృథ్వీరాజ్ సుకుమారన్.. సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు తెలుగులో ఎంతోమంది అభిమానులను కూడా దక్కించుకున్నారు.. అయితే ఇక్కడ నటుడుగా ప్రేక్షకులను అలరిస్తున్నారని చెప్పాలి.. ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran).. ఈ సినిమాలో వీరిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులుగా సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ నిజ జీవితంలో కూడా అంతే మంచి స్నేహితులుగా మారిపోయారు.. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ప్రభాస్ ను సహాయం అడగకూడదు..

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్తో స్నేహం గురించి అలాగే ప్రభాస్ లాంటి వాళ్లను అస్సలు సహాయం అడగకూడదు అంటూ కూడా పృథ్వీరాజ్ కామెంట్లు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.మలయాళం లో ఈయన నటించిన ఆడు జీవితం అనే సినిమా తెలుగులో కూడా విడుదల కావడానికి సిద్ధం అవుతోంది. ఈ సినిమా మార్చ్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.. ఈ క్రమంలోనే ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న ఈయనకు మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురయింది.. మీరు , ప్రభాస్ ఎంతో మంచి స్నేహితులు.. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ప్రభాస్ ని తీసుకొస్తే సరిపోయేది కదా అనే ప్రశ్న ఈయనకి ఎదురు కావడంతో.. ఈ ప్రశ్నకి సమాధానం తెలిపారు పృథ్వీరాజ్.. నేను అడిగితే ప్రభాస్ నాకు రాను అని చెప్పడు .. చెప్పలేడు కూడా.. చెప్పలేని వారిని ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదు.. అది చాలా తప్పు.. అంటూ ఈ సందర్భంగా ఈయన కామెంట్లు చేశారు..ఇలా మరోసారి ప్రభాస్ గొప్పదనాన్ని అభిమానులకు తెలిసేలా చేశారు పృధ్విరాజ్ సుకుమారన్..ఇకపోతే ఇదివరకే ప్రభాస్ గొప్పతనం గురించి ఆయనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే విషయాల గురించి ఎంతో గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికైతే ప్రభాస్ గొప్పతనం గురించి మరొకసారి అందరికీ తెలిసేలా చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్..

ప్రభాస్ సినిమాలు..

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కల్కి 2898 AD చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత రాజా సాబ్, సలార్-2 చిత్రాలలో కూడా నటించబోతున్నారు. వీటితోపాటు స్పిరిట్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే..ఈ సినిమాలన్నీ అయిపోయిన వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

పృథ్వీరాజ్ సుకుమారన్..

ఇక ఈయన విషయానికి వస్తే.. గతంలోనే చిరంజీవితో కలసి నటించే అవకాశం వస్తే.. ఆడు జీవితం సినిమా కారణంగా ఏకంగా రెండుసార్లు అవకాశాన్ని కోల్పోయారు. మళ్ళీ చిరు తో అవకాశం వస్తే కలిసి నటిస్తారో లేదో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు