Personality Development : ఈ అలవాట్లు ఉంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్టే

Personality Development : వ్యక్తిగత జీవితం అయినా వర్క్ లైఫ్ అయినా మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే చిన్న చిన్న విషయాలకు హర్ట్ అవ్వకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తడబడకుండా లైఫ్ లో సక్సెస్ వైపు పరుగులు పెట్టగలుగుతారు. అంతేకాకుండా అనవసరమైన స్ట్రెస్ తో ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటారు. అప్పుడే ప్రశాంతంగా, సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. మరి ఇంతకీ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? అంటే కొన్ని అలవాట్లను రెగ్యులర్ గా ఫాలో అయితే సరిపోతుంది. మరి మిమ్మల్ని మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంచే ఆ అలవాట్లు ఏంటి? అంటే…

1. ఓడిపోతానని భయం వద్దు

ఓటమి భయంతో జీవితంలో వెనుతిరిగే పొరపాటును ఎప్పుడూ చేయకండి. మానసికంగా, దృఢంగా ఉన్న వ్యక్తులు ఫెయిల్యూర్ ను డెడ్ ఎండ్ గా ఎప్పుడూ చూడరు. ఫెయిల్యూర్ అనేది ఒక కొత్త ప్రారంభం అని అంటారు. కాబట్టి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని, కొత్త అవకాశాల వైపు అడుగేయండి.

2. రిస్క్ తీసుకోండి

ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లోనే ఉండడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు డెవలప్ కావాలంటే రిస్క్ తీసుకోవడం తప్పదు. అయితే రిస్క్ తీసుకుంటున్నప్పుడు ముందుగానే బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం మంచిది. అప్పుడే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉండదు.

- Advertisement -

3. సరిహద్దులు సెట్ చేయండి

మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులకు తమ జీవితంలో ఏ వ్యక్తికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు. తమ ఇంపార్టెన్స్ కు తగ్గట్టుగా బౌండరీస్ సెట్ చేసుకుంటారు. ఎవ్వరూ ఆ బౌండరీస్ దాటకుండా చూసుకుంటారు. తమ కంఫర్ట్ కే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు.

4. నో చెప్పడం నేర్చుకోండి

ప్రతి పనికి ఎస్ అని చెప్పే అలవాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. కాబట్టి అవసరమైన విషయాల్లో నో చెప్పడానికి వెనకాడకండి. మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు తమ సమయానికి, ఎమోషన్స్ కు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారు. కాబట్టి ఎలాంటి సందర్భాల్లోనూ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గకుండా చూసుకుంటారు. అవసరమైన సమయంలో మొహమాటంతో పని లేకుండా నో చెప్పి అనవసరమైన భారాన్ని తమ నెత్తిపై వేసుకోకుండా జాగ్రత్త పడతారు.

4. కృతజ్ఞత

ఇక మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తి పడతారు. కృతజ్ఞతతో ఉండే అలవాటును కలిగి ఉంటారు. అలాంటివారు చిన్నపాటి ఆనందాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుని సంతోషంగా జీవిస్తారు.

5. ఒంటరితనంలో ఓదార్పు

మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లు ఒంటరితనానికి భయపడరు. ఒంటరితనాన్ని తమ శక్తిగా భావించి, సింగిల్ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తమ బలాలు, బలహీనతల గురించి తెలుసుకోగలుగుతారు. ఒంటరితనం వల్ల ఇతరులపై ఆధారపడే అలవాటు కూడా తగ్గిపోతుంది. ఏ పనినైనా సమర్థవంతంగా, ధైర్యంగా ఒక్కరే చేయగలుగుతారు. మరి మీరు కూడా మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ హ్యాబిట్స్ ను అలవాటు చేసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు