Siddharth and Aditi Rao Hydari : పెళ్లి కాదు ఎంగేజ్‌మెంట్ మాత్రమే… ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు

Siddharth and Aditi Rao Hydari : బుధవారం ఉదయం సోషల్ మీడియాలో సడన్‌గా ఓ వార్త వైరల్ అయింది. అది ఏంటంటే… చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ – అదితి రావ్ హైదరి పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని శ్రీరంగ నాయక టెంపుల్ లో అతి తక్కువ మంది బంధువుల మధ్య సిద్ధార్థ్ – అదితి రావ్ హైదరి పెళ్లి చేసుకున్నారని టాక్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో సిద్ధార్థ్ – అదితి రావ్ హైదరిల పెళ్లి అయిపోయిందని అనుకున్నారు. కానీ తర్వాత అది నిజమైన పెళ్లి కాదని, షూటింగ్ అనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ పెళ్లి వార్తలపై అటు సిద్ధార్థ్, ఇటు అదితి ఇద్దరూ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇంతకీ పెళ్లి వార్తలపై సిద్ధార్థ, అదితి రియాక్షన్ ఏంటి? అసలేం జరిగింది? అంటే…

పెళ్లి కాదు ఎంగేజ్మెంట్ మాత్రమే…

“మహాసముద్రం” మూవీ టైంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి మధ్య పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దాదాపు మూడేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట మార్చ్ 27న పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారనే వార్తలు గుప్పుమన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఈ జంట తెలంగాణలోని వనపర్తిలో ఉన్న శ్రీ రంగనాయక ఆలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారని అన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే బయటకు వచ్చిన డెకరేషన్ వీడియోలు చూశాక అది షూటింగుకు సంబంధించిన పెళ్లి అని రూమర్లు వచ్చాయి. కానీ అది షూటింగ్ పెళ్లి కాదు, రియల్ పెళ్లి కాదు అనే విషయాన్ని తాజాగా ఈ లవ్ బర్డ్స్ బయట పెట్టారు.

సోషల్ మీడియా వేదికగా ఆమె ఎస్ చెప్పింది, అతను ఎస్ చెప్పాడు అంటూ ఇద్దరూ సపరేట్ సపరేట్ గా పోస్టులు పెట్టి మరీ తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అనే విషయాన్ని ప్రకటించారు. ఇక ఆ పోస్టులలో ఇద్దరు ఒకే రకమైన ఫోటోలు పెట్టి, ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయం జనాలకు అర్థమయ్యేలా తాము మార్చుకున్న రింగులు కనిపించే విధంగా ఫోజులిచ్చారు. దీంతో ఎట్టకేలకు సిద్ధార్థ్, అతిధి రావు హైదరి పెళ్లి గురించి ఇప్పటిదాకా నెలకొన్న సస్పెన్స్ వీడినట్టు అయ్యింది. మరి ఈ జంట పెళ్లెప్పుడు చేసుకుంటారు అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఇక సోషల్ మీడియాలో అఫీషియల్ గా వీళ్ళు తమ ఎంగేజ్మెంట్ ను అనౌన్స్ చేస్తూ పెట్టిన పోస్టులు చూసి అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

- Advertisement -

ఇంత డ్రామా దేనికి?

1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించింది అదితి. మరోవైపు సిద్ధార్థ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో పుట్టాడు. ప్రస్తుతం అదితి వయసు 37 సంవత్సరాలు కాగా, సిద్ధార్థ్ వయసు 44 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 7 ఏళ్ల వ్యత్యాసం ఉందన్న మాట. వీరిద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్. సిద్ధార్థ్ గతంలో తన చిన్ననాటి స్నేహితురాలైన మేఘన నారాయణన్ ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ మొదటి పెళ్లి 2003లో జరగగా, 2007లో డివోర్స్ తీసుకున్నారు. మరోవైపు అదితి సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. హీరోయిన్ గా కెరీర్ లో స్టార్ట్ చేసిన మొదట్లోనే ఆమె వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసింది.

2013లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. రంగనాయక స్వామి ఆలయంలో జరిగేదంతా షూటింగ్ అని ముందుగా చెప్పారట. ఈ పెళ్లిని తమిళనాడుకు చెందిన పూజారులే దగ్గరుండి జరిపించగా, హిందూ సాంప్రదాయంలో పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లయ్యేదాకా స్థానిక పూజారులను కూడా కనీసం ఆలయంలోకి అనుమతించలేదని సమాచారం. అదితి రావు హైదరి తల్లి విద్యా రావు వనపర్తి సంస్థాన చివరి రాజు జే రామేశ్వరరావు కూతురు. ఈ వేడుకకు జే రామేశ్వరరావు వారసులు జే కృష్ణదేవరావు కుటుంబం హాజరైంది. మరి ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇంత సీక్రెట్ మైంటైన్ చేయడం, డ్రామా చేయడం దేనికి ? అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది నెటిజెన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు