Siddharth – Aditi Rao Hydari Marriage : సిద్ధార్థ్, అతిది సీక్రెట్ మ్యారేజ్… ఎక్కడంటే?

Siddharth – Aditi Rao Hydari Marriage : తమిళ హీరో సిద్ధార్థ్, హైదరాబాది హీరోయిన్ అదితి రావు హైదరిని రహస్యంగా వివాహం చేసుకున్న  విషయం బట్టబయలైంది. గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట సీక్రెట్ గా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. మరి ఇంతకీ ఈ లవ్ బర్డ్స్ ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఆ పెళ్లి సంగతులు ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

సీక్రెట్ గా మ్యారేజ్…

సిద్ధార్థ్, అదితి రావు హైదరి ( Siddharth – Aditi Rao Hydari Marriage  ) చాలాకాలంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. 2021లో “మహాసముద్రం” సినిమాలో కలిసి పని చేస్తున్నప్పుడే వీరిమధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ జంట లవ్ లో పడ్డారు. అప్పటినుంచి వీరిద్దరూ ఎక్కడ చూసినా కలిసే కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా మహాసముద్రం మూవీ ప్రమోషన్ టైంలో డైరెక్టర్ కూడా వీరి ప్రేమాయణం గురించి హింట్ ఇచ్చారు. రీసెంట్ గా హిట్ అయిన సిద్ధార్థ్ మూవీ “చిన్నా” సక్సెస్ మీట్ లో కూడా అదితి సందడి చేసింది. ఈ లవ్ రూమర్స్ గురించి అటు అదితి గాని, ఇటు సిద్ధార్థ్ గాని స్పందించలేదు. కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని ఇండైరెక్ట్ గా బయట పెడుతూనే ఉన్నారు. గత కొంతకాలంగా మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలను సిద్ధార్థ, అదితి నిజం చేసేసారు. తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న శ్రీరంగాపూర్ శ్రీరంగనాయక స్వామి ఆలయంలో ఈరోజు వీరిద్దరి వివాహం జరిగినట్టు సమాచారం. ఈరోజు ఉదయం అత్యంత సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ, అదితి మెడలో మూడు ముళ్ళు వేసినట్టుగా తెలుస్తోంది. కానీ పెళ్లి గురించి సిద్ధార్థ కానీ, అదితి రావు గాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

వనపర్తి లోనే పెళ్లి ఎందుకంటే?

మరి ఈ జంట స్పెషల్ గా వనపర్తి లో ఉన్న రంగనాయక స్వామి ఆలయంలోనే ఎందుకు ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అంటే దానికి ప్రత్యేక కారణమే ఉంది. వనపర్తి సంస్థానాధీశుల వారసులే అదితి కుటుంబం సభ్యులు. కాబట్టి అదితికి, ఆమె తల్లిదండ్రులకు వనపర్తి సంస్థానం, ఈ ప్రసిద్ధ దేవాలయంతో లోతైన సంబంధం ఉంది. అందుకే 18వ శతాబ్దానికి చెందిన గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయంలో సిద్ధార్థ్, అది రావు హైదరి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వేడుకను తమిళనాడులోని పూజారులు నిర్వహించినట్టు సమాచారం. కాగా అదితి రావుకి ఇది రెండో పెళ్లి. 2009లో సత్యదీప్ మిశ్రాను అదితి పెళ్లాడింది. 2013లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. ఇక సిద్ధార్థ కూడా గతంలో పలువురు హీరోయిన్లను లవ్ చేసి, బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే. అందులో సమంత కూడా ఒకరు. మొత్తానికి సిద్ధార్థ, అదితి చేసుకున్న ఈ సీక్రెట్ మ్యారేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు