Directors : తమ జీవితాలనే స్క్రీన్ పై చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్స్ లిస్ట్

Directors : షిప్ కి కెప్టెన్ ఎలాగో సినిమాకి డైరెక్టర్ కూడా అలాంటి కెప్టెన్ అంటారు. సముద్రంలో ఓడను కెప్టెన్ ఎలా ముందుండి నడిపిస్తాడో అలాగే దర్శకుడు కూడా సినిమా బండిని ముందుకు నడిపిస్తాడు. అందుకే సినిమా హిట్ అయినా, ఫ్లాపైనా దర్శకుడికి ఆ క్రెడిట్ దక్కాల్సిందే. ముఖ్యంగా ప్లాప్ అయితే ఆ నిందను మోయాల్సింది దర్శకుడే. సినిమా హిట్ అవ్వడానికి వాళ్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. కోట్లాది మందిని ఎంటర్టైన్ చేయడానికి కొత్త కొత్త కథలను వెతికి పట్టుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ (Directors) ఉండగా, అందులో కొంతమంది ఏకంగా తమ నిజజీవితాలని సిల్వర్ స్క్రీన్ పై సినిమాగా చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. మరి ఇంతకీ ఆ డైరెక్టర్స్ ఎవరు? దర్శకుల నిజ జీవితంతో తెరకెక్కిన సినిమాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

1. గౌతమ్ మీనన్

తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ గురించి సౌత్ మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాల్లో సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఒక కల్ట్ మూవీ అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఈ మూవీ రీ రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తన రియల్ లైఫ్ స్టోరీనే “సూర్య సన్నాఫ్ కృష్ణన్” సినిమాగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తన జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ఎవర్ గ్రీన్ మూవీ గౌతమ్ మీనన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2. ప్రదీప్ రంగనాథ్

రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజై థియేటర్లను షేక్ చేసిన మూవీ లవ్ టుడే. డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ రియల్ స్టోరీనే ఈ మూవీ. అయితే నిజజీవితంలో వాళ్ళు విడిపోయారట. కానీ సినిమాలో మాత్రం క్లైమాక్స్ లో హీరో హీరోయిన్లను కలిపేశాడు దర్శకుడు. ఈ మూవీ సంచలన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

3. సముద్రఖని

నటుడిగా, దర్శకుడిగా సముద్రఖని మోస్ట్ వాంటెడ్. అయితే శంభో శివ శంభో అనే మూవీతో అప్పట్లోనే దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సముద్రఖని. ఈ మూవీలో రవితేజ, అల్లరి నరేష్, రాజీవ్ కనకాల హీరోలుగా నటించారు. ఫ్రెండ్షిప్ కోసం ఎంతకైనా తెగించే ప్రాణ స్నేహితులుగా కనిపించారు. ఈ మూవీ డైరెక్టర్ కం యాక్టర్ సముద్రఖని నిజజీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆయన తన జీవితంలో నిజంగానే ఇద్దరు స్నేహితుల పెళ్లిని సినిమాలో లాగే కష్టపడి చేశారట. కానీ వాళ్లు విడిపోయారట. లవ్ వాల్యూ తెలియని వాళ్లకు కష్టపడి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పడానికే ఆయన ఈ సినిమాను తెరకెక్కించారట. ఈ విషయాన్ని సముద్రఖని స్వయంగా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ ముగ్గురు దర్శకులుగానే కాకుండా నటులుగా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రదీప్ రంగనాథ్ హీరోగా, డైరెక్టర్ గా యూత్ ను ఆకట్టుకునే కథాంశాలతో సినిమాలు తీస్తుంటే, సముద్రఖని ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ, డైరెక్టర్ గా కూడా రాణిస్తున్నారు. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన కూడా దర్శకుడుగానే కాకుండా నటుడిగా అదరగొడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు