Jaragandi : అడ్డంగా బుక్ అయిన తమన్… “జరగండి” సాంగ్ కూడా కాపీనే

Jaragandi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఊహించని చిక్కులు తెచ్చి పెట్టింది. ఎప్పటిలాగే తాజాగా రిలీజ్ అయిన “జరగండి” (Jaragandi) సాంగ్ కూడా కాపీనే అనే విషయాన్ని నెటిజెన్లు ఇట్టే కనిపెట్టేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రూఫ్ తో సహా ఆ సాంగ్ ట్యూన్స్ ను తమన్ ఎక్కడ కాపీ కొట్టాడు అనే విషయాన్ని బయట పెడుతున్నారు. మరి ఇంతకీ జరగండి సాంగ్ ఏ పాటకు కాపీ? అంటే…

మళ్లీ అడ్డంగా బుక్కైన తమన్…

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ట్రీట్ గా గేమ్ చేంజర్ సినిమా నుంచి “జరగండి” అనే పాటను రిలీజ్ చేశారు. కానీ పాట అలా రిలీజ్ అయిందో లేదో ఇలా ట్రోలింగ్ మొదలైపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “శక్తి” సినిమాలోని ఓ పాటతో “జరగండి” సాంగ్ ట్యూన్ మ్యాచ్ అవుతోంది. “శక్తి” మూవీ హిట్ కాలేదు కానీ సాంగ్స్ మాత్రం సూపర్ సూపర్ హిట్ అయ్యాయి. మణిశర్మ అందించిన బాణీలు సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. ఆ మూవీలోని “సుర్రా సుర్ర…” అనే పాట స్టార్టింగ్ ట్యూన్ “జరగండి” సాంగ్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వడంతో సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైపోయింది. ఎక్కడో విన్నట్టు ఉంది అనుకుంటున్నాం. దొరికేసావ్ తమన్ అంటూ రెండు పాటలకు సంబంధించిన క్లిప్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇదేం మొదటిసారి కాదు….

ఇక తమన్ కు కూడా ట్రోలింగ్ అనేది బాగా అలవాటైపోయినట్టుంది. ఆయన కొత్త పాటలు రిలీజ్ అయిన ప్రతిసారి ఇవే విమర్శలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా గుంటూరు కారం మూవీ పాటల విషయంలో కూడా తమన్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. వాస్తవానికి తమన్ మణిశర్మ దగ్గర కొన్ని సినిమాలకు పని చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. కానీ ఆయన ట్యూన్స్ కాపీ అనే విమర్శలు మాత్రం ఎప్పుడూ ఉండేవే. ఈ పాట వల్ల తమన్ పై మాత్రమే కాకుండా రామ్ చరణ్ డాన్స్, లుక్ పై కూడా ట్రోలింగ్ మొదలైంది.

- Advertisement -

లీక్ అయినప్పటి నుంచే…

కాగా “జరగండి” సాంగ్ రిలీజ్ కి ముందే లీక్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లోనే తమన్ ఈ పాటకు ఇచ్చిన ట్యూన్, లిరిక్స్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కంప్లీట్ సాంగ్ రిలీజ్ అయితే ఆ విమర్శలకు గట్టిగా రిప్లై ఇచ్చినట్టు అవుతుందని మెగా ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు. కానీ తమన్ మాత్రం వాళ్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ ట్రోలర్స్ కు అడ్డంగా దొరికిపోయారు. ఫస్ట్ సాంగ్ పరిస్థితే ఇలా ఉంటే “గేమ్ చేంజర్” మూవీకి మ్యూజిక్ పరంగా ముందు ముందు ఇంకెన్ని విమర్శలు వస్తాయో చూడాలి.

“గేమ్ చేంజర్”ది కూడా “గుంటూరు కారం” పరిస్థితేనా?

“గుంటూరు కారం” మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగి, చివరికి తీవ్ర నెగిటివిటీ కారణంగా యావరేజ్ తో మహేష్ బాబు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. “గేమ్ చేంజర్” విషయంలో ఫుల్ ఆకలితో ఉన్నారు మెగా ఫాన్స్. అందుకే ఒకానొక సందర్భంలో అప్డేట్స్ ఇవ్వనందుకు శంకర్ పై తిట్ల పురాణం కూడా నడిచింది. కానీ ఇప్పుడు అప్డేట్స్ ఇచ్చినా కూడా నెగెటివిటీ కంటిన్యూ అవుతోంది. మరి ఈ మూవీ కూడా “గుంటూరు కారం”లాగే నెగెటివిటీ కారణంగా అంచనాలను అందుకోలేకపోతుందా? లేదంటే శంకర్ దీనంతటికీ బ్లాక్ బస్టర్ టాక్ తో ఫుల్ స్టాప్ పెడతారా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు