Ananya nagalla : కాబోయే భర్త పై అలాంటి వ్యాఖ్యలు చేసిన అనన్య ..!!

Ananya nagalla : టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది హీరోయిన్ అనన్య నాగళ్ళ (Ananya nagalla).. ఈమె గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. మొదట మల్లేశం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.. తన మొదటి సినిమాతోనే తన నటనతో, అందంతో అందరిని ఆకట్టుకుంది.. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించడంతో మరింత క్రేజ్ అందుకుంది.. అయినప్పటికీ కూడా అవకాశాలు మాత్రం రాకపోవడంతో తానే అవకాశాల కోసం తెగ వెతికేస్తోంది.

ఇంటర్వ్యూ లో అనన్య..

నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు గాలం వేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాకుండా తాను ఎలాంటి పాత్రలోనైనా చేయగలనని.. ఈ విధంగా ఈమె ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అనన్య నాగల్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తంత్ర.. ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకుంది. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అనన్య నాగళ్ళ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

కాబోయే వాడు అలాగే వుండాలి..

ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూ.. తనకు కాబోయే భర్త గురించి ఎలా ఉండాలని అడగగా.. అందుకు అనన్య తనకు ఇలాంటి హస్బెండ్ కావాలని తెలియజేసింది.. ముఖ్యంగా నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో నాని క్యారెక్టర్ లాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ తెలియజేసింది. భార్య భర్తలు అంటే ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండాలన్నదే తన ఉద్దేశం అన్నట్లుగా అనన్య నాగళ్ళ తెలియజేసింది.. ఇకపోతే ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలోనే కాబోయే భర్త గురించి ఆలోచించారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి ఈ విషయంపై అనన్య మరెలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి..

- Advertisement -

అనన్య వ్యక్తిగత జీవితం..

అనన్య నాగళ్ళ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రం ,ఖమ్మం జిల్లా ..సత్తుపల్లిలో జన్మించిన ఈమె హైదరాబాద్లోని రాజమహేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది.. బీటెక్ తర్వాత కొంతకాలం సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేసిన ఈమె.. ఆ తర్వాత నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. తన నటనతో అందచందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక తంత్ర సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అంద చందాలతో బోల్డ్ పాత్రల్లో కూడా నటించగలను అని దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తోంది కాబట్టి మరి ఎలాంటి పాత్రలు ఈమెను వరిస్తాయో చూడాలి.. ఏది ఏమైనా అనన్య నాగల్ల ఇప్పుడు మళ్లీ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు