Allu Arjun : రామ్ చరణ్ కు వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్..!!

Allu Arjun : మెగా ఇంట్లో వేడుకలు అంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మెగా వారసుడు రామ్ చరణ్ పుట్టినరోజు అంటే ఇక ఆ ఇల్లు అంతా కూడా కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు, సన్నిహితుల సైతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.. ఈ విధంగా మెగా హీరోలు సైతం చరణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్ కు కాస్త వెరైటీగా బర్తడే విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను కూడా చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారుతున్నది.

స్పెషల్ గా బన్నీ బర్త్ డే విషెస్..

అల్లు అర్జున్ (Allu Arjun)షేర్ చేసిన ఈ వీడియోలో ఏదో ఈవెంట్ లో అందరూ కలిసి డాన్స్ చేస్తున్నట్టుగా ఉన్నది.. ఈ వీడియో పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్తడే మై మోస్ట్ స్పెషల్ కజిన్.. లవ్ యు అంటూ రాసుకు వచ్చారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో అందరూ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా రామ్ చరణ్ కు బెస్ట్ విషెష్ తెలుపుతూ ఉంటారని తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, నిహారిక ,అల్లు శిరీష్ కలిసి డాన్స్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో నాటు నాటు పాట ట్యూన్ అందిస్తున్నట్టుగా కనిపిస్తోంది.చాలా విభిన్నమైన స్టైల్ లో అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

అల్లు అర్జున్ సినిమా విశేషాలు..

అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్.. పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూజా కార్యక్రమాలను లాంచనంగా జరిపి ఆ తర్వాత షూటింగ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

రామ్ చరణ్ సినిమా విశేషాలు..

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే..గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబుతో ఒక సినిమా, సుకుమార్తో మరొక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

మగధీర రీ రిలీజ్..

ఇకపోతే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.. ముఖ్యంగా ఈరోజు మగధీర సినిమా రీ రిలీజ్ కావడం చేత అభిమానులు థియేటర్లకు కడుతున్నారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ఇప్పుడు మరింత క్రేజ్ పెంచుకున్నారు. ఏది ఏమైనా ఒక్క సినిమా రామ్ చరణ్ జీవితాన్నే మార్చేసింది అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు