Hbd Ram charan : చిరుత నుంచి RRR సినిమా వరకు రామ్ చరణ్ నట ప్రస్థానం..!!

Hbd Ram charan : టాలీవుడ్ లో మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతోంది. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకున్నారు రామ్ చరణ్.. ఈ రోజున రామ్ చరణ్ 38 వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సైతం ఈ వేడుకను చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు.. అభిమానులతో పాటు ఇటు సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు (Hbd Ram charan) తెలియజేస్తున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ సినీ ప్రస్థానం ఎలా మొదలైందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

రామ్ చరణ్ నటనా ప్రస్థానం..

1985 మార్చి 27న చెన్నైలో రామ్ చరణ్ జన్మించారు.. రామ్ చరణ్ మొదటి చిత్రం చిరుత.. ఈ సినిమాని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఉత్తమ డెబ్యూ హీరోగా అవార్డుగా అందుకున్నారు రామ్ చరణ్..రామ్ చరణ్ రెండవ చిత్రమే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఈ సినిమా ఒక్కసారిగా ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసింది. ఈ చిత్రంతో ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక మూడవ సినిమాగా ఆరెంజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. మ్యూజికల్ పరంగా పెద్ద హిట్ అయినా..ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అంతేకాదు ఈ సినిమాతో నాగబాబు కొన్ని కోట్లు నష్టపోయారు.

బాలీవుడ్ లో కూడా సత్తా..

జంజీర్ సినిమా రీమేక్ తో బాలీవుడ్లోకి మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. చిరంజీవి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తన తండ్రి కోసం కొణిదెల ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించి ఖైదీ నెంబర్-150 చిత్రంతో నిర్మాతగా మారి తన తండ్రిని రీయంట్రి లో తీసుకురావడం జరిగింది.. రామ్ చరణ్ కి తన తల్లి సురేఖ అంటే చాలా ఇష్టం ..ముఖ్యంగా రామ్ చరణ్ భార్య ఉపాసనతో ఎక్కువ సమయాన్ని గడపడానికి మక్కువ చూపుతూ ఉంటారు.

- Advertisement -

రామ్ చరణ్ చిత్రాలు..

రామ్ చరణ్ రచ్చ, నాయక్ , ఎవడు, గోవిందుడు అందరివాడేలే , ధ్రువ వంటి చిత్రాలలో కూడా నటించారు. అలాగే తన తండ్రి తో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్ తన తండ్రీ తో మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150, ఆచార్య వంటి చిత్రాలలో స్క్రీన్లు షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్ కెరియర్ లో మలుపు తిప్పిన చిత్రాలలో రంగస్థలం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాతో తన నెక్స్ట్ లెవెల్ లో నటనని ప్రదర్శించారు.RRR చిత్రంతో రామ్ చరణ్ ఏకంగా పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరొక సినిమా.. ఆ వెంటనే సుకుమార్ తో కూడా తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు