Spirit : ప్రభాస్ కి గట్టి పోటీనే.. థియేటర్ లు మోత మోగాల్సిందే..!

Spirit : ఎవరైనా డైరెక్టర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారంటే చాలు ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమా మొదలు పెట్టేస్తూ ఉంటారు.. దీంతో ఈ సినిమాల పైన భారీ హైప్ నెలకొంటూ ఉంటుంది. అలాగే గతంలో చేసిన సినిమా లాగే ఇప్పుడు వచ్చే సినిమా కూడా ఉండాలని అభిమానులైతే అనుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా అభిమానులు అలాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా డైరెక్టర్లు కూడా పూర్తిగా శ్రమిస్తారనే చెప్పాలి. ఇక అలాంటి డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒకరు.. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించిన సందీప్ రెడ్డివంగ ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి స్పిరిట్ ( Spirit ) సినిమాని చేయబోతున్నారు..

స్పిరిట్ లో బాలీవుడ్ హీరో..

దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పిరిట్ సినిమాలో విలన్ గా ఎవరు ఉంటారని .. హీరోయిన్గా ఎవరుంటారు అనే విషయం పైన పలు రకాల ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి.. ఈ రెండు రకాల ప్రశ్నలకు సైతం రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటించబోతున్నారనే వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.. అతను ఎవరో కాదు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. రోబో 2.0 సినిమాతో ఇప్పటికే విలన్ గా మెప్పించారు ఇప్పుడు మరొకసారి ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారని సమాచారం.

అక్షయ్ కుమార్ కోసం భారీ ప్లాన్..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబో అనగానే మంచి హైప్స్ కనిపిస్తూ ఉంటాయి. సందీప్ సినిమాలలో చూపించే హీరోయిజానికి ప్రభాస్ కటౌట్ బాగా సరిపోతుందని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు.. అందుకు తగ్గట్టుగానే అక్షయ్ కుమార్ కూడా విలన్ గా నటించబోతున్నారని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా యానిమల్ సినిమాలో హీరో పాత్రని , విలన్ పాత్రని చిత్రీకరించిన తీరు కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. అందుచేతనే ఈసారి అక్షయ్ కుమార్ ని స్పిరిట్ సినిమాలో విలన్ గా చూపించాలని చూస్తున్నారట.

- Advertisement -

హీరోయిన్ గా కరీనా కపూర్..

హీరోయిన్ గా కరీనాకపూర్ నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరొక హీరోయిన్గా త్రిప్తి డిమ్రి నటించబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయాల పైన అటు డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.. కరీనాకపూర్ ఇప్పటివరకు తెలుగు సినిమాలో నటించలేదు. మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. మరి ఏ విధంగా తెలుగువారిని ఆకట్టుకుంటుందో చూడాలి.

ప్రభాస్ చిత్రాలు..

ప్రస్తుతం ప్రభాస్ అయితే కల్కి సినిమాతో పాటు రాజా సాబ్ అనే సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. అలాగే సలార్-2 చిత్రంలో కూడా నటించబోతున్నారు.ఈ సినిమాలన్నీ అయిపోయిన వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు