Prabhas : సొంత ఊరి కోసం ప్రభాస్ చేస్తున్న పని తెలిస్తే శభాష్ అనాల్సిందే..!!

Prabhas : టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఎంతోమందికి సహాయం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రభాస్ కి ఎన్నో వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ చాలా సింపుల్ గానే కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడే ప్రభాస్ తనతో నటించే సహనటీనటులకు కూడా తమ వంటింటి రుచులను పరిచయం చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్ ఆతిథ్యం స్వీకరించి ఆయన పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ప్రభాస్ పంపించిన వంటలన్నింటినీ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ తమకోసం ప్రభాస్ ( Prabhas ) అందించిన ఆతిథ్యం అంటూ కూడా షేర్ చేసేవారు.. ఇక ప్రభాస్ మంచి భోజనం ప్రియులని తెలిసిందే.. అందుకే ఇలాంటివి చేస్తూ ఉంటారని అభిమానులు సైతం కామెంట్లు చేస్తుంటారు.

సొంత ఊరికి సహాయం..

ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకే కాకుండా తనతో పని చేసే వారందరితో సమానంగానే ఈ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు.. అందుకే అందరూ కూడా ప్రభాస్ ప్రేమకు మంత్రముగ్ధులవుతుంటారు అనడంలో సందేహం లేదు.. ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ముందు వరుసలో ఉండే ప్రభాస్ ఇప్పుడు తన సొంత ఊరి కోసం కూడా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ప్రభాస్ తన కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన సొంత ఊరుని చాలా బాగా చూసుకుంటారని చెప్పవచ్చు.. తాజాగా రూ.200 కోట్ల రూపాయలు పెట్టి మొగల్తూరులో రోడ్లు వేయించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్..

తన సొంత ఊరు అభివృద్ధి కోసమే ఈ పనులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ తన ఊరికి సంబంధించి రోడ్లు బాగుండాలని ఫిక్స్ అవడంతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు తాను ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత.. తన సొంత ఊరి కంటూ ఏదైనా గుర్తింపు వుండాలని… ఆ ఊరికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా అండగా నిలుస్తానని.. ప్రభాస్ మాట ఇవ్వడం ఆయన గొప్పతనం.. ఈ విషయం విన్న ప్రభాస్ అభిమానుల సైతం ప్రభాస్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

సొంత ఊరి కోసం ప్రభాస్, మహేష్ ఇద్దరూ ఒకే బాటలో..

ఇక మహేష్ బాబు కూడా తన సొంత ఊరు బుర్రిపాలెం లో కూడా ఎన్నో పనులను చేయిస్తూ.. ఎంతోమందికి గుండె ఆపరేషన్లు కూడా చేయించి మంచి మనసు చాటుకున్నారు. ఇక వీరే కాకుండా ఇలా ఇప్పటికే ఎంతోమంది నటీనటులు కూడా తమ సొంత ఊరి కోసం ఏవో ఒక పనులు చేస్తూనే ఉన్నారు.

ప్రభాస్ సినిమాలు..

ప్రస్తుతం ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ మూవీతో ప్రేక్షకుల ముందు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి.. త్వరలోనే కల్కి 2898 ఏడి సినిమా కూడా విడుదల కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు