Mahesh Babu: మనుష్యులందునీ కథా మహర్షి లాగా సాగదా

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా చిన్న వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. మహేష్ ఎన్ని సినిమాలు చేసినా కూడా మురారి అనే సినిమా మహేష్ కి మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అక్కడితోనే మహేష్ బాబు కి చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్ అయ్యారు.

మహేష్ బాబు స్టార్డం తీసుకొచ్చిన సినిమా మాత్రం ఒక్కడు అని చెప్పొచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. సినిమా తర్వాత మహేష్ కి ఒక కమర్షియల్ ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలకు కొన్ని మంచి హిట్ అయ్యాయి. పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్ వంటి సినిమాలు ఆల్ టైం హిట్ రికార్డ్ ను సాధించాయి.

రీసెంట్ గా మీ సినిమాకు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు మహేష్ బాబు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమా డిజాస్టర్ అయిపోతుంది అని అందరూ అనుకున్న తరుణంలో మహేష్ బాబు కి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ వలన ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చింది. ఇకపోతే మహేష్ బాబు ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

మహేష్ బాబు చేసిన సేవ కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ చేయించడం. ఒక ఊరిని దత్త తీసుకోవడం. ఇవన్నీ మహేష్ బాబుకి ఆఫ్ స్క్రీన్ పై కూడా మంచి గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పటికీ మహేష్ బాబు అంటే చాలామంది ఒక దేవుడిలా కొలుస్తారని కూడా చెప్పొచ్చు. మహేష్ బాబు ఫౌండేషన్ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాడు మహేష్.

ఇక రీసెంట్ గా ఔట్‌రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్శిటీ, మహేష్ బాబు ఫౌండేషన్ (MB ఫౌండేషన్) భాగస్వామ్యంతో “Heartathon: A Run to Support Children Battling with congenital Heart Disease,” అనే కార్యక్రమాన్ని పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన మరియు నిధులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం మార్చి 16వ తేదీన KBR పార్క్‌లో జరిగింది, ఇందులో సుమారు 300 మంది వ్యక్తులు 3 కి.మీ నుంచి 5 కి.మీ మార్గంలో పరుగెత్తారు.

మహేశ్ బాబు ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు నమ్రతా శిరోద్కర్ ఈ వేడుకను పురస్కరించుకుని అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా విజేతలను వ్యక్తిగతంగా సత్కరించారు. దీనిలో అంకితభావంతో పాల్గొన్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడానికి వారి నిబద్ధతను ప్రదర్శిస్తూ, మహేష్ బాబు ఫౌండేషన్ మరియు ఔట్‌రీచ్ క్లబ్‌ల మధ్య సహకార స్ఫూర్తిని హార్ట్‌థాన్ చెప్పుకొస్తుంది.

మహర్షి సినిమాలో మహేష్ బాబుకి ఒక పాటలో రాసినట్టు మనుష్యులందునీ కదా మహర్షి లాగా సాగదా అనే అనే లైన్ కి మహేష్ బాబు రియల్ లైఫ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు