Mahesh Babu : కొత్త లుక్ లీక్… జక్కన్న రూల్స్ ను పక్కన పెట్టేసిన మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో మహేష్, రాజమౌళి రూల్స్ ను బ్రేక్ చేశాడు అంటూ ప్రచారం మొదలైంది. మరి ఇంతకీ మహేష్ కొత్త లుక్ కథ ఏంటి? నిజంగానే ఆయన రాజమౌళి రూల్ ని బ్రేక్ చేశాడా? అనే వివరాల్లోకి వెళ్తే….

SSMB 29 ప్రీ ప్రొడక్షన్ లో…
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ SSMB 29. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అసలు ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ఘట్టమనేని అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ సినిమా కోసమే మహేష్ యూరప్ వెళ్లి మరీ ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు. అలాగే రాజమౌళి విజన్ కు తగ్గట్టుగా మేకోవర్ కూడా మార్చుకున్నాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారికి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ పిక్ ఒకటి షాక్ ఇచ్చింది.

రాజమౌళి రూల్ ను మహేష్ బ్రేక్ చేశాడా?
సాధారణంగా రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా సరే రెండు లేదా మూడు ఏళ్లు బల్క్ డేట్స్ కేటాయించాల్సిందే. అంతేకాదు ఆయన సినిమాను పూర్తి చేసేదాకా ఇతర ప్రాజెక్టుకి కమిట్ అవ్వకూడదు. అలాగే మూవీ షూటింగ్ గురించి గానీ, పాత్రల గురించి గానీ ఎలాంటి లీక్స్ ఇవ్వకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ కంప్లీట్ అయ్యేదాకా ఆ హీరో అసలు బయట ఎక్కడా కనిపించకూడదు. సోషల్ మీడియాలో అంతకన్నా ఉండకూడదు. ఒకవేళ అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సి వస్తే వ్యక్తిగత విషయాలను మాత్రమే ప్రస్తావించాల్సి ఉంటుంది. మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా సరే స్వయంగా చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించాల్సిందే. రాజమౌళి సినిమా అంటే హీరో అజ్ఞాతవాసం చేయాల్సిందే. అయితే మహేష్ ఇంకా మూవీ కూడా స్టార్ట్ కాకముందే ఆయన రూల్ ను బ్రేక్ చేశాడు అంటున్నారు. తాజాగా బయటకు వచ్చిన పిక్ చూసినవాళ్లు. ఇక వైరల్ అవుతున్న ఆ పిక్ చూసి చిత్ర బృందం టెన్షన్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

ఇంతకీ ఆ పిక్ కథేంటి?
ఇక ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్న పిక్ విషయానికి వస్తే… అది రాజమౌళి సినిమాకు సంబంధించింది కాదు. మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ తో కలిసి ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఈ యాడ్ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాబట్టి SSMB 29 లుక్ లిక్ అయిందేమో అని టెన్షన్ పడుతున్న మహేష్ అభిమానులు ఇక చిల్ అవ్వండి. కాగా SSMB 29లో మహేష్ కోసం ఏకంగా ఎనిమిది లుక్స్ క్రియేట్ చేశారట టీం. అందులో రాజమౌళి విజన్ కు తగ్గ లుక్, సూపర్ స్టార్ కు సెట్ అయ్యే లుక్ ను ఫైనల్ చేయనున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు