Hari Hara Veera Mallu : క్రేజీ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఏకైక ఇన్కమ్ సోర్స్ కేవలం సినిమాలు మాత్రమే కాబట్టి వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇకపోతే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

వేణు శ్రీరామ్ తీసిన ఈ సినిమా పింక్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అమితాబ్ బచ్చన్ నటించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎలా సెట్ అవుతుంది అని చాలామంది అప్పట్లో అనుకున్నారు. కానీ ఇలా కూడా చేసి ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులకి కావలసిన ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేసి అద్భుతమైన హిట్ ను పవన్ ఖాతాలో వేశాడు వేణు.

వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా అయ్యప్పనుకోసియం అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. సాగర్ కె చంద్ర ఈ సినిమాను తెలుగులో తీశాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ను అందించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది.

- Advertisement -

అయితే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చాలా సినిమాలను సైన్ చేశాడు. వాటిలో హరిహర వీరమల్లు ప్రాజెక్టు కూడా ఒకటి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని ప్రాజెక్టుల అప్డేట్లు వస్తున్నాయి. కానీ హరిహర వీరమల్లు సంబంధించి ఏ అప్డేట్లు రావడం లేదు. పవన్ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

ఒక సందర్భంలో ఈ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన ఫ్రీ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెడతాం అని నిర్మాత రత్నం ఇదివరకే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇకపోతే రీసెంట్గా ముంబైలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక ఈవెంట్ ను నిర్వహించింది.

ఈ ఈవెంట్లో పాల్గొన్నారు క్రిష్ జాగర్లమూడి,రత్నం,నిధి అగర్వాల్.
ఈ ఈవెంట్ లో హరిహర వీరమల్లు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇది 17వ శతాబ్దానికి చెందిన సినిమా అని, దీనిలో మన కల్చర్ సనాతన ధర్మం వంటి అంశాలతో పాటు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. అని చెప్పుకొచ్చారు నిర్మాత రత్నం. ఈ సినిమా గురించి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా మాట్లాడారు. ఈ సినిమా ఒక రెబలియన్ స్టొరీ అని, శాక్రిఫైజ్, హానర్ వంటి అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు