Sobhan Babu death anniversary : హీరోగా ఎదగడానికి అందరికంటే ఎక్కువ కష్టపడ్డ శోభన్ బాబు..

తెలుగు సినీ పరిశ్రమలో తొలితరం స్టార్ హీరోలలో ఒకరైన శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు అంత అందగాడు ఎవరూ లేరని అప్పటి ప్రేక్షకులు అంటూ ఉంటారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కంటే కూడా ఎక్కువగా మహిళా ప్రేక్షకాదరణ పొందిన నటుడాయన. తెరపై సంగ్రామం చేసే అభిమన్యుడిగా, చెల్లిని అభిమానించే అన్నయ్యగా, కుటుంబాన్ని పోషించే సగటు బాధ్యతగల తండ్రైనా, ప్రేక్షకుల మనసుల్లో నటభూషణుడిగా, ఆంధ్రుల అందగాడిగా, అన్నిటికి మించి నిరాడంబరత కలిగిన మంచి మనిషిగా ఎంతో పేరు తెచ్చుకున్న శోభన్ బాబు వర్ధంతి నేడు. తొలి తరం అగ్ర కథానాయకులలో ఒకరిగా ఎదిగిన శోభన్ బాబు ఆ స్థాయికి రావడానికి ఆ జనరేషన్ లో అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడని తెలుసా? ఆయన ఇండస్ట్రీలో ఎదిగిన విధానం గురించి ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

శోభనాచలపతి నుండి శోభన్ బాబు..

ఒక సామాన్య రైతు కుటుంబం లో జన్మించిన శోభన్ బాబు చిన్నతనం నుండే సినిమాలపై ఆసక్తి కనబరిచేవాడు. అందుకే మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ కాలేజీ రోజుల్లోనే ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. ఆ టైం లోనే తన పేరు అచ్చిరావడం లేదని, కాస్త తగ్గించి పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో పొన్నులూరి బ్రదర్స్ వారు నిర్మించిన ‘దైవబలం’ చిత్రంలో రామారావు పక్కన ఒక చిన్న పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 17 సెప్టెంబరున 1959న విడుదల కాగా, ఆ చిత్రం విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన ‘భక్త శబరి’ చిత్రంలో ఒక మునికుమారునిగా చిన్న పాత్రలో నటించాడు. 1960 జూలై 15న విడుదలయిన ఆ సినిమా ఓ మోస్తరు విజయవంతమవ్వడంతో శోభన్ బాబు కు అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రల్లో నటించాడు.

- Advertisement -

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా..

కెరీర్ తొలినాళ్లలో శోభన్ బాబు చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. కూడా పోషించసాగాడు. ఆయన తర్వాత వచ్చిన కృష్ణ లాంటి నటులు కూడా స్టార్స్ అయిపోయారు. కానీ శోభన్ బాబుకి బ్రేక్ రావడానికి చాలా టైం పట్టింది. గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కథ, ప్రతిజ్ఞా పాలన లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. అయితే శోభన్ బాబు ఆర్థిక పరిస్థితుల వల్ల చిన్న పాత్రలైనా నటించడానికి వెనకాడలేదు. అయితే ఆ కాలంలో అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడుగా భీష్మలో, లక్ష్మణుడుగా సీతారామకల్యాణంలో, కృష్ణునిగా బుద్ధిమంతుడులో శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు. ఈ సినిమాల్లో సహాయ పాత్రలు లభించడంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు ఆ రోజుల్లో పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది.

వీరాభిమన్యుడిగా విజయపరంపర..

శోభన్ బాబు ప్రధాన పాత్రలో 1965 లో వచ్చిన వీరాభిమన్యు చిత్రంలో అభిమన్యుడి పాత్రతో తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమాతో శోభన్ బాబు వెనుదిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది. అయితే సోలో హీరోగా సక్సెస్ మాత్రం ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక’ అనే చిత్రంతో వచ్చింది. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటుగా శోభన్ బాబు ని స్టార్ గా నిలబెట్టిన సినిమా 1969లో విడుదలయిన ‘మనుషులు మారాలి’. శోభన్ బాబు కార్మిక నాయకుడిగా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో మైలురాయిగా నిలవగా, ఈ చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చును. ఇక ఆ తర్వాత చెల్లెలి కాపురం, సంపూర్ణ రామాయణం, దేవాలయం, సోగ్గాడు, మల్లెపువ్వు మొదలయిన చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. అయితే మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ ఇమేజిని తెచ్చిపెట్టింది. ఇక్కడి నుండి కమర్షియల్ చిత్రాల్లోనే శోభన్ బాబు ఎక్కువగా నటించాడు. అయితే శోభన్ బాబు 1959 లో ఇండస్ట్రీ కి పరిచయమవగా, ఆయన స్టార్ గా మారడానికి దాదాపు పదేళ్లు సమయం పట్టిందని చెప్పొచ్చు. ఆ జెనరేషన్ అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లు మూడు నాలుగేళ్ళలోనే హీరోలుగా స్టార్ డమ్ సంపాదించారు. ఇక 1996 లో హలొ గురు సినిమాలో శోభన్ బాబు చివరిగా నటించడం జరిగింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు