సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ సినిమా ఈ సంక్రాంతి కి రిలీజ్ అయి మంచి ప్రేక్షకారణ పొందిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ మహేష్ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాపై అంత మంచి టాక్ రాలేదన్న మాట వాస్తవం. ఓవరాల్ గా మూవీ కి మిక్సడ్ రెస్పాన్స్ లభించిందని చెప్పాలి. అయితే ప్రీమియర్స్ నుండే కొంతమంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడంతో ఆ టాక్ కలెక్షన్ల పైన పడింది. పైగా హనుమాన్ మూవీ అనూహ్యంగా దీనికంటే బెటర్ టాక్ తెచ్చుకోవడంతో గుంటూరు కారం సంక్రాంతి వరకూ బాగానే ఆడినా లాంగ్ రన్ లో ప్రభావం చూపలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా రీసెంట్ గా ఓటిటి లో రిలీజ్ కాగా, అక్కడ కూడా మహేష్ మ్యానియా ఓ రేంజ్ లో సాగుతుంది.
ఓటిటి లో గుంటూరుకారం హవా..
రీసెంట్ గా గుంటూరు కారం ఓటిటి లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అది కూడా హిందీ వెర్షన్ లో అదరగొడుతుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో నెల కిందట రిలీజ్ అయిన గుంటూరు కారం సౌత్ భాషలన్నిటితో పాటు హిందీలో కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి తెగ నచ్చేసిందట. ఈ సినిమాలోని పాటలు, ఫైట్లకు బాగా కనెక్ట్ అయిన అక్కడి ఆడియన్స్ గత కొన్ని రోజులుగా రిపీట్ చేసి మరీ చూస్తున్నారట. ఇక్కడి వరకూ ఊహించిందే అయినా, తాజాగా గుంటూరు కారం దాయాది దేశాల్లో కూడా ఓ రేంజ్ లో ఆదరణ తెచ్చుకుంది.. అవును..
పాకిస్థాన్ లో గుంటూరు కారం ఘాటు..
అవును.. గుంటూరు కారం ఒక్క నార్త్ లోనే కాదు దాయాది దేశాలైన పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లలో కూడా గుంటూరు కారం ఘాటు ప్రదర్శిస్తుంది. అక్కడ ఈ కారం చాలా ఘాటు నషాళానికి అంటుతోందని సమాచారం. దాదాపు 5 వారాలుగా ఆ దేశాల్లో గుంటూరు కారం టాప్ 5 లో ట్రెండింగ్ అవుతుందిట. అంతగా మన `గుంటూరు కారం` నచ్చేసింది హిందీ జనాలకు. ఇక మహేష్ నటించిన గుంటూరు కారం తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ గా ఆడినా, పాకిస్తానీలను, అలాగే బంగ్లాదేశీయులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుందని తాజా ఓటీటీ చార్టులు చెబుతున్నాయి.
ఇండియా లో గత కొన్ని రోజులుగా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 సినిమాలలో అన్వేషిప్పిన్ కందెతుమ్ , మెర్రీ క్రిస్మస్ వంటి సినిమాలు అగ్రస్థానంలో నిలిచాయి, అయితే మహేష్ చిత్రం గుంటూరు కారం వరుసగా ఐదవ వారంలో కూడా టాప్ 10 జాబితాలో నిలిచింది. అయితే పక్క దేశాల్లో కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అవడం విశేషం. ఇక గుంటూరు కారం థియేట్రికల్ రన్ పరంగా 90 శాతం రికవరీ చేసి యావరేజ్ హిట్ అవగా, దాదాపు 185 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.
Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.