Gunturu kaaram: “రమణగాడి” వన్ మ్యాన్ షో లెక్క.. కానీ విజయానికి అంత దూరంలో?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీగా రిలీజ్ అవగా, అందులో అన్నిటికంటే భారీ అంచనాలతో రిలీజ్ అయిన పెద్ద సినిమా “గుంటూరు కారం”. ఈ సినిమా పై అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన బజ్ ఉండేది. దానికి కారణం త్రివిక్రమ్ మహేష్ కాంబోనే. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. దానికితోడు కొంతమంది యాంటీస్ కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేసారు. అయితే ఈ టాక్ గాని, నెగిటివిటి గాని సినిమాపై పెద్దగా ప్రభావం చూపలేదు.

సంక్రాంతి పండక్కి థియేటర్లో రమణ గాడి మోత మోగిపోయింది. ఇక మొదటి వారం పూర్తయ్యే సరికి “గుంటూరు కారం” వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు సాధించింది. ఒక్కసారి ఏరియా వారీగా ఆ లెక్కల్ని గమనిస్తే..

నైజాం : 31.57Cr
సీడెడ్ : 8.83Cr
ఉత్తరాంధ్ర : 10.59Cr
ఈస్ట్ : 8.21Cr
వెస్ట్ : 5.20Cr
గుంటూరు : 7.72Cr
కృష్ణ : 5.90Cr
నెల్లూరు : 3.29Cr
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 81.31 కోట్ల షేర్ వసూలు చేయగా,123.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 6.00 కోట్లు
ఓవర్సీస్ లో 14.15 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా గుంటూరు కారం ఫస్ట్ వీక్ ముగిసే సరికి 101.46 కోట్ల షేర్ వసూలు చేయగా 165.05 కోట్ల గ్రాస్ రాబట్టింది.

- Advertisement -

గుంటూరు కారం థియేట్రికల్ బిజినెస్ 132 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 31 కోట్లు రాబట్టాలి. కానీ ఈ సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయ్యిందని, 212 కోట్ల గ్రాస్ రాబట్టింది మేకర్స్ ప్రకటించినా, అది ఫేక్ అని సమాచారం. అయితే గుంటూరు కారం రెండో వారంలోకి ఎంటర్ అయ్యాక మూవీ టికెట్ రేట్లు నార్మల్ అయ్యాయి. దాని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, రిపీటెడ్ ఆడియన్స్ థియేటర్లకు రావచ్చు. అందువల్ల గుంటూరు కారం రెండో వారం కూడా మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. మరి గుంటూరు కారం థియేటర్ కలెక్షన్లు ఎండ్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు