Prashanth Varma: “హనుమాన్” ఫస్ట్ వీక్ లెక్క.. మూడు రెట్లు ఎక్కువ..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవగా, అందులో మీడియం రేంజ్ సినిమా గా రిలీజ్ అయిన “హనుమాన్” సినిమాకే ఎక్కువ ప్రజాదరణ లభిస్తుందని తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా, ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించాడు. ఇక ప్రీమియర్స్ నుండే సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు సాధిస్తుంది. దీనికి పోటీగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలను తట్టుకుని మరీ సెన్సేషనల్ కలెక్షన్లు సాధిస్తుంది.

ఇక తాజాగా హనుమాన్ మూవీ మొదటి వారం పూర్తవగా ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు బయటికి వచ్చాయి. ఏరియా వారీగా ఆ కలెక్షన్ల వివరాలు చూసుకుంటే…

నైజాం : 17.73Cr
సీడెడ్ : 5.05Cr
ఉత్తరాంధ్ర : 5.23Cr
ఈస్ట్ : 3.94Cr
వెస్ట్ : 3.15CR (GST added)
గుంటూరు : 2.52Cr
కృష్ణ : 2.21Cr
నెల్లూరు : 1.21Cr

- Advertisement -

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 41.04 కోట్ల షేర్, 64.95 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక లో 6.25Cr, హిందీ ఇంకా రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 11.70Cr, ఓవర్సీస్ లో 17.70Cr షేర్ రాబట్టగా, టోటల్ వరల్డ్ వైడ్ గా హనుమాన్ మొదటివారం 76.69 కోట్ల షేర్ ‘143.80 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక ఈ ఎనిమిదవ రోజు తో హనుమాన్ అఫిషియల్ గా 150 కోట్ల క్లబ్ లో చేరిపోవడం విశేషం. రెండో వారం ముగిసే సరికి హనుమాన్ మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు