Guntur Kaaram Collections: టాక్ నెగటివ్… కానీ కలక్షన్స్ పాజిటివ్… మళ్లీ అదే జరిగింది

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ కాబట్టి దీనిపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. కేవలం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే హ్యాపీ అయ్యారని త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో అసలు కనిపించలేదని, త్రివిక్రమ్ టైప్ ఆఫ్ డైలాగ్స్ లేవని చాలా విమర్శలు ఎదుర్కున్నారు. అయితే ఈ సినిమా అజ్ఞాతవాసి తో కూడా కొందరు పోల్చారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ పాలు అవుతుందని కొంతమంది చెప్పుకొచ్చారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా అద్భుతంగా థియేటర్లో కొనసాగుతుంది. మామూలుగా త్రివిక్రమ్ సినిమా టాక్ వెంటనే బయటికి వస్తుంది. ఇదివరకే వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపురంలో సినిమాలకు కేవలం రెండు రోజుల్లోనే అంతా పాజిటివ్ టాక్ వచ్చి అద్భుతమైన కలెక్షన్లు రాబట్టాయి ఆ రెండు సినిమాలు. ఇకపోతే గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే నాకు కొంచెం నెగిటివ్గా వచ్చిన కలెక్షన్ మాత్రం మెల్లమెల్లగా పెరుగుతూ పోతున్నాయి.

కొందరు ఈ సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడిన కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 212 కోట్లను వసూలు చేసినట్లు ఈ సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రీజనల్ సినిమాలో హైయెస్ట్ వసూలు చేసిన సినిమాల లిస్టులో గుంటూరు కారం సినిమా టాప్ ప్లేస్ చేసిన సాధించింది. ఏదేమైనా పండగ సీజన్లో ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకున్న కూడా కలెక్షన్ వైస్ మాత్రం తన ప్రభావాన్ని ఇంకా చూపిస్తుంది. ఆంధ్రలో ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాలో హైయెస్ట్ కలెక్షన్ రాబెట్టిన సినిమాగా గుంటూరు కారం సినిమా చెప్పొచ్చు. ఏదేమైనా అజ్ఞాతవాసిలా డిజాస్టర్ అవుతుంది అనుకున్న సినిమా ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం అనేది కొద్దిపాటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఈ ట్రెండు ఇలానే కొనసాగితే ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ ఈ సినిమా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇకపోతే అతడు ఖలేజా సినిమాలు వలే ఈ సినిమా తర్వాత కూడా అందరికీ ఇష్టమైన సినిమా అవుతుందని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ సినిమా అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అని ఒప్పుకోవాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు