Guntur Kaaram : సినిమా ఆడక పోవడానికి ఇదే కారణమట… నాగ వంశీకి సాకు దొరికింది

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. డిజాస్టర్ గా మిగులుతుంది అనుకున్న ఈ సినిమాను మహేష్ బాబు ఇమేజ్ నిలబెట్టిందనీ, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కారణంగా బాగానే కలెక్షన్స్ రాబడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే చిత్ర బృందం ప్రకటిస్తున్న కలెక్షన్స్ ఫేక్ అని, కావాలని కలెక్షన్లను పెంచి చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినబడుతున్నాయి. తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో “గుంటూరు కారం” నిర్మాత నాగ వంశీ సినిమా కలెక్షన్లు, అనుకున్న విధంగా ఆడక పోవడానికి కారణాలు ఏంటన్న విషయాన్ని బయట పెట్టారు.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో “గుంటూరు కారం” నిర్మాత నాగ వంశీకి సినీ జర్నలిస్టుల నుంచి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా రివ్యూలకు సంబంధించిన ప్రశ్నలపై నాగ వంశీ స్పందిస్తూ రివ్యూలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించలేవని, మూవీని చంపాలన్నా, నిలబెట్టాలన్నా అది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఇక ప్రెస్ మీట్ లో అజ్ఞాతవాసి మూవీని ప్రస్తావించిన నాగ వంశీ ఆ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్స్ రాలేదని, “గుంటూరు కారం” సినిమాకు మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ వచ్చాయని, రివ్యూస్ అనేవి యూజ్ లెస్ అని నాగ వంశీ చెప్పుకొచ్చారు. ఇక ఫేక్ కలెక్షన్ల ప్రస్తావన రాగా… “గుంటూరు కారం” సినిమాకి వచ్చినవి ఫేక్ కలెక్షన్స్ అని ప్రూవ్ చేయమంటూ నాగవంశీ చాలెంజ్ విసిరారు. ఇప్పుడు తన సినిమాకు ఫేక్ కలెక్షన్స్ అని చెబుతున్న వాళ్లకు అంతకు ముందు వచ్చిన సినిమాల కలెక్షన్స్ అన్ని జెన్యూన్ అని తెలుసు కదా? ఆ విషయాన్ని ఎలా ప్రూవ్ చేశారు ఇప్పుడు “గుంటూరు కారం” సినిమా కలెక్షన్ల విషయంలో కూడా అలాగే ప్రూవ్ చేయాలి అని నాగ వంశీ కోరారు.

ఇక ఈ సినిమాకు అమెరికాలో తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి అనే విషయంపై నాగ వంశీ స్పందిస్తూ అక్కడి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇవ్వలేకపోయామని, వాళ్లు ఒకటి ఆశిస్తే, కంటెంట్ మాత్రం మరోలా ఉందని, ముందు నుంచి “గుంటూరు కారం” మూవీ ఫ్యామిలీ మూవీ అనే విషయాన్ని ప్రచారం చేయలేకపోయామని, ఆడియన్స్ ని ఆ దిశగా ప్రిపేర్ చేయడంలో ఫెయిల్ అయ్యామని అన్నారు. నాగ వంశీ కొనసాగిస్తూ ఒక ఫ్యామిలీ కథ చెప్పాలనుకున్నప్పుడు అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టమేనని, అలాగే అన్ని ఏరియాలోను ఆడియన్స్ ని రీచ్ అవ్వాలని లేదు కదా? అంటూ తిరిగి ప్రశ్నించారు. 10 -12 ఏరియాలో సినిమాను అమ్మితే 11 ఏరియాల్లో రీచ్ అయ్యిందని, కేవలం ఒకటి రెండు ఏరియాల్లో మాత్రం రీచ్ అవ్వలేదని, దానికి ఏం చేయలేమని నాగ వంశీ చెప్పుకొచ్చారు. దీంతో సినిమా రిలీజ్ కు ముందు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని మహేష్ బాబు అభిమానులకు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రామిస్ చేసి, ఇప్పుడు సినిమా ఆడక పోవడానికి ఇలా సాకులు చెబుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు