Ayodhya: రామ మందిర ప్రారంభోత్సవాల్లో అవెంజర్స్… పిక్స్ వైరల్

ఈనెల 22న అయోధ్యలో జరగబోతున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి అవెంజర్స్ అంతా తరలి వచ్చారు. పైగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రామ మందిరంలో జరుగుతున్న పలు పనులకు తమ వంతు సాయం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవెంజర్స్ అనే వాళ్లే లేరు. వాళ్ళు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే కదా? లేదంటే మనోళ్లే ఎవరైనా అలాంటి కాస్ట్యూమ్స్ ధరించి అయోధ్యలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారేమో అని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే…

ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో మనం ఊహించింది ఏదైనా కళ్ళ ముందుకు తేవడం క్షణాల్లో పని అవుతోంది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్) వాడి మన ఊహ ప్రపంచాన్ని తనివి తీరా చూసుకోగలుగుతున్నాం. అయితే సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ కు అనుగుణంగా ఏఐ వాడి పలువురు క్రియేట్ చేస్తున్న ఇమేజెస్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం దేశం మొత్తం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అయోధ్య వేడుకల్లో డిసి కామిక్స్, మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలు తిరుగుతున్నట్టుగా క్రియేట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ పిక్స్ ను క్రియేట్ చేసిన క్రియేటర్స్ ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయగా అవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా, 506 మంది గెస్ట్ ల సమక్షంలో జరగబోతున్న అయోధ్య రామ మందిరం ప్రారంభ మహోత్సవంలో సూపర్ హీరోలు ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్, వండర్ వుమన్, స్పైడర్ మాన్, హల్క్, డెడ్ పూల్, థానోస్, జోకర్ వంటి వారు కనిపించారు.

ఈ సూపర్ హీరోలతో పాటు పాపులర్ మూవీస్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ నుంచి కెప్టెన్ జాక్ స్పారో, స్టార్ వార్స్ నుంచి పలువురు సూపర్ హీరోలు, హ్యారీ పోటర్ వంటి వారు రామ మందిరం పనుల్లో హెల్ప్ చేస్తూ కనిపించారు. కాగా రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకలు ఏడు రోజులపాటు భారీ ఎత్తున జరగనున్నాయి. జనవరి 16 నుంచే కొన్ని ఆచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గురువారం గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. వాళ్లతో పాటు సూపర్ హీరోలు కూడా ఇలా ఏఐ ద్వారా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. మరి ఒక్కసారి మీరు కూడా అయోధ్యలో కనిపించిన ఆ సూపర్ హీరోలపై ఓ లుక్కెయ్యండి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు