Anjali : విడాకులు తీసుకున్న నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్న తెలుగు హీరోయిన్ ..!!

Anjali : తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అచ్చ తెలుగు అమ్మాయిగా, హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఒకపక్క హీరోయిన్ గా చేస్తూనే మరొకపక్క కీలకమైన పాత్రలలో, పలు సినిమాలలో నటిస్తోంది అంజలి.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది.. ఇందులో ఈమె సెకండ్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇక మరోవైపు అంజలి(Anjali) కెరీర్ నే మార్చేసిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ని కూడా మొదలుపెట్టి సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది.

అంజలి పెళ్ళి..

అయితే గతంలో కూడా హీరోయిన్ అంజలి పెళ్లి గురించి పలు రకాల రూమర్స్ వినిపించాయి.. ఒక బిజినెస్ మాన్ వివాహం చేసుకోబోతోందని.. దీంతో ఆమె విదేశాల్లోనే సెటిల్ అయిందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చినా.. ఇలాంటి సమయంలోనే ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ మళ్ళీ ప్రచారం మొదలయింది.. త్వరలోనే ఒక తెలుగు నిర్మాతను ఈమె వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

రూమర్స్ పై క్లారిటీ..

నిజానికి గతంలో క్లారిటీ ఇచ్చినప్పుడే తాను ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో వుండడం వల్లే తన కెరియర్ నాశనం అయ్యిందని వెల్లడించింది.. ఆ సంబంధం రాంగ్ రిలేషన్ అన్నట్లుగా కూడా అంజలి తెలియజేసింది.. తన కెరీర్ కు అడ్డుగా ఉన్న ఆ రిలేషన్ కంటే తన కెరీర్ కి ఇంపార్టెంట్ ఇవ్వడం మంచిదని తెలియజేసింది అంజలి.

- Advertisement -

ఆల్రెడీ విడాకులైన నిర్మాతతో పెళ్లి..

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. అంజలి ఇప్పుడు విడాకులు తీసుకున్న ఒక తెలుగు నిర్మాతతో గత ఏడాది కాలంగా ఈమె డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అతనిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.. తమిళ మీడియా నుంచి ఈ వార్తలు రావడంతో టాలీవుడ్ లో కూడా అంజలి పెళ్లి గురించి ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలన్నిటికీ ఈసారి కూడా అంజలి(Anjali) ఎలాంటి పుల్ స్టాప్ పెడుతుందో చూడాలి మరి.. గతంలో కూడా అంజలి ఒక హీరోతో పీకల్లోతులో లవ్ లో ఉందని.. కొన్ని కారణాల చేత వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి.

అంజలి కెరియర్..

మొదట్లో షాపింగ్ మాల్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఈమె ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంది. ఇక తర్వాత జర్నీ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది.. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ కూడా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడే వరుస సినిమాలు చేసుకుంటూ సెటిల్ అయిపోయింది.. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది అంజలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు