Nag Ashwin : నాగ్ అశ్విన్.. ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికినట్టేనా..?

Nag Ashwin : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదైనా అద్భుతం జరగాలి అంటే కచ్చితంగా రాజమౌళి మాత్రమే చేయగలరనే నమ్మకం సినీ ప్రేక్షకులలో పెరిగిపోయింది.. ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతిని వివిధ దేశాలలో కూడా చాటిచెబుతున్న ఘనత కేవలం రాజమౌళికే సాధ్యం .. అయితే రాజమౌళి తర్వాత మళ్లీ అంతటి అద్భుతాన్ని సృష్టించగలిగిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin)మాత్రమే అని తెలుస్తోంది.. మొదట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత మహానటి సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కల్కి సినిమాని చేస్తున్నారు.

కల్కి టైటిల్ పెట్టడానికి కారణం..

కల్కి 2898 AD సినిమాని పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.. తెలుగు సినిమా రేంజిని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తానంటూ తెలియజేస్తున్నారు. ఐదేళ్లుగా ఈ సినిమా కోసమే తాను కష్టపడుతున్నానని వెల్లడించారు నాగ్ అశ్విన్.. ఈ చిత్రం కథ భవిష్యత్తులో 2898 సంవత్సరంతో ముగుస్తుందని.. దాదాపుగా 6000 ఏళ్ల కథ అన్నట్టుగా నాగ్ అశ్విన్ తెలిపారు.. అందుకే ఈ చిత్రాన్ని కల్కి 2898 AD సినిమాగా పేరు పెట్టారని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

విడుదల తేదీ వాయిదా..

భారతీయ ఇతిహాసాల చుట్టూ తిరిగే కథ కల్కి సినిమా అన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అశ్వద్ధామతో పాటు విష్ణు అంశం కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే కల్కి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని.. మే తొమ్మిదవ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.. అయితే ఊహించని విధంగా ఎన్నికలు మే 13వ తేదీన ఉండడంతో రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయ్యేలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

- Advertisement -

రాజమౌళి బాటలో డైరెక్టర్ నాగ్ అశ్విన్..

దీంతో కల్కి చిత్రానికి ఎలాగో సమయం దొరికిందని.. కల్కి చిత్రానికి మరింత మెరుగు పట్టేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్సయిన చిత్ర బృందం చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసింది. అయితే ఇప్పుడు విడుదల తేదీ వాయిదా పడడంతో మిగతా పనులు కాస్త స్లో అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. రాజమౌళి కూడా కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నప్పటికీ తనకు నచ్చిన ఔట్పుట్ కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు.. ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా అలాంటి పనిలోనే ఉన్నట్లు తెలుస్తోంది..

కల్కి కోసం భారీ ప్లాన్

ముఖ్యంగా రాజమౌళి ఎలాంటి సినిమాలు తీసినా చాలా క్వాలిటీతో.. నిజంగానే ఇది జరిగింది అనేలా తీస్తూ ఉంటారు.. అలాంటి టెక్నికల్స్ ని ఉపయోగించి ఇప్పుడు కల్కి సినిమాని కూడా తీస్తున్నారు.. మరి కల్కి సినిమా విడుదలై రాజమౌళి తర్వాత అంతటి క్రేజ్ ను నాగ్ అశ్విన్ అందుకుంటారో లేదో చూడాలి మరి. ఏదేమైనా ఈ సినిమా సక్సెస్ అయితే సినిమా ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికినట్లే అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు