Sushmita : చిరు కూతురిపై ట్రోల్స్.. దానికి పనికిరాదంటూ..!

Sushmita : టాలీవుడ్లో మెగాస్టార్ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. కానీ చిరంజీవి.. తన కూతుర్ల వల్ల ఎన్నోసార్లు చాలా దారుణంగా ట్రోల్స్ కి గురైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ చిరంజీవి మాత్రం తమ కూతుర్లను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు.. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత(Sushmita) ప్రస్తుతం తన తండ్రి సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నది.. ఇటీవల చిరంజీవి నటించిన ప్రతి చిత్రంలో కూడా ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తోంది. చిరంజీవిని యంగ్ గా చూపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నా.. అందుకు తగ్గట్టుగా ఫలితాలు మాత్రం రావడం లేదు.

మళ్లీ తెరపైకి రిపోర్ట్ ఇజం..

చిరంజీవి మాత్రం తన కూతురు వర్క్ పట్ల ఎన్నోసార్లు ప్రశంసలు కూడా కురిపించారు.. తనని బాగా చూపించేందుకు చాలా కష్టపడుతుందని రాను రానూ మరింత ఎక్కువగా చూపించబోతున్నట్లు తెలియజేశారు చిరంజీవి.. అయితే చిరంజీవి ఈ విషయంలో మురిసిపోతున్నా.. అభిమానులలో మాత్రం విభిన్నమైన అభిప్రాయాలు సైతం మొదలవుతున్నాయి.. చిరంజీవి లుక్స్ బాగా ఉండడం లేదని.. అందుకు కారణం చిరంజీవి కూతురు సుస్మితనే(Sushmita)అంటూ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. అన్ని సినిమాలలో రెగ్యులర్గా చూపిస్తున్నట్లు చూపిస్తున్నారని.. నెపోటిజం అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.

సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో సుస్మిత..

చిరంజీవి లుక్స్ లో కూడా మార్పు ఉండడం లేదని మార్పు ఉంటే బాగుంటుందంటూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.. సుస్మిత కొణిదెల సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా పాల్గొని.. ఇందులో సినిమా గురించి కాస్టింగ్ గురించి ఆమె మాట్లాడుతూ ఉండడంతో నెటిజన్లు రియాక్ట్ అవుతూ నానా రచ్చ చేస్తున్నారు…. ముఖ్యంగా చిరంజీవిని చాలా స్టైలిష్ గా చూపించొద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాదు చిరంజీవి డిజైనర్ నుంచి ఆమెను తప్పించాలని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ కూడా తన కూతుర్లకు అవకాశం ఇచ్చి చేజేతులారా తన కెరీయర్ని దూరం చేసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -

రజనీకాంత్ లాగే చిరంజీవి కూడా అవుతారా..

అటు రజనీకాంత్ తన కూతుర్లతో చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు.. మొత్తం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.. ఇప్పుడు చిరంజీవి విషయంలో కూడా ఇదే జరుగుతోందంటూ పలువురు అభిమానులు వాపోతున్నారు.. మొదట సుస్మితని నిర్మాతగా చేయాలనుకున్నప్పుడు ఆ మధ్య స్క్రిప్ట్ డిస్కషన్ కూడా జరిగిందట. కళ్యాణ్ కృష్ణ సినిమా చేయాలనుకున్న సమయంలో కొన్ని కారణాల చేత ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. ఒకవేళ ఆ సినిమా తీసి ప్లాప్ అయితే అందుకు కారణం కూడా సుస్మిత అని అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి సినిమాలు..

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించగా.. హీరోయిన్గా త్రిష నటిస్తోంది..అలాగే చిరంజీవికి చెల్లెలుగా ఇందులో ఐదు మంది హీరోయిన్స్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరగబోతోంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు