Manchu Vishnu : తెలుగు హీరోలపై అలాంటి కామెంట్స్ చేసిన మంచు విష్ణు..!!

Manchu Vishnu : మంచు మోహన్ బాబు వారసుడిగా విష్ణు(Manchu Vishnu) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అవుతోంది.. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ఫుల్ హీరోగా పేరు సంపాదించుకోలేకపోయారు.. ప్రస్తుతం కన్నప్ప అనే ప్రాజెక్టుతో ఒక సెన్సేషనల్ గా మారిపోయిన మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టుని ప్రకటించారు.. వీటికి తోడు ఈ సినిమాలో అగ్ర హీరోలతో పాటు క్రేజ్ వున్న నటీనటులను కూడా నటింప చేయడంతో కన్నప్ప సినిమా పై భారీగానే బజ్ ఏర్పడింది. రిలీజ్ అయిన పోస్టర్లకు కూడా మంచి హైప్ తీసుకువచ్చేలా చేస్తున్నారు మేకర్స్.. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేసే విధంగా చిత్ర బృందం పలు రకాల జాగ్రత్తలతో ముందుకు వెళ్తోంది.

న్యూజిలాండ్ లో కన్నప్ప..

ప్రస్తుతం కన్నప్ప సినిమా షూటింగ్ అంతా న్యూజిలాండ్ లోనే చేయడం మరింత హైప్ పెరిగింది.. ఇలా అన్ని రకాలుగా మంచు విష్ణు పేరు అయితే ఇప్పుడు బాగా వినిపిస్తోంది.. గత సినిమాల ఫ్లాపులతో సంబంధం లేకుండా కన్నప్ప సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది..ఇదిలా వుండగా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న మంచు విష్ణు తెలుగు నుంచి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

తెలుగు హీరోలపై మంచు విష్ణు కామెంట్స్..

చిరంజీవి పద్మ విభీషణ్ అందుకున్నారని అదే కుటుంబం నుంచి స్టార్ అయిన బన్నీ కేరళలో అసాధారణమైన ఫ్యాన్ ఫాలింగ్ కలిగి ఉన్నారంటూ తెలిపారు. అలాగే డార్లింగ్ ప్రభాస్ ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడుగా పేరు పొందాలని.. ఆ రేంజ్ లో తన సినిమాలు కూడా విడుదలవుతున్నాయని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నా బ్రదర్ అంటూ కూడా కితాబిచ్చారు.. మహేష్ నటిస్తున్న 29వ చిత్రం ఇండియాలోనే అతిపెద్ద చిత్రం అవుతుందంటూ కూడా తెలియజేశారు..

- Advertisement -

కన్నప్ప మూవీ పై మంచు విష్ణు స్పందన..

కానీ తాను నటిస్తున్న కన్నప్ప సినిమా గురించి హైప్ పెంచేస్తూ.. కన్నప్ప సినిమాకి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వకుండా ఈ సినిమా రిలీజ్ వరకు సస్పెన్స్ తోనే క్యూరియాసిటీ పెంచేస్తానంటూ వెల్లడించారు. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కన్నప్ప సినిమాకి కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.. న్యూజిలాండ్లో ఈ చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి వరుసగా సినిమా షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్న మంచు విష్ణు ఇటీవలే కాస్త విరామం తీసుకుని వెకేషన్ కి వెళ్ళినట్లుగా సమాచారం. ఇక వెకేషన్ కి వెళ్లి వచ్చిన వెంటనే మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఏదేమైనా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు మంచు విష్ణు.. మరి ఎలాంటి ఫలితం లభిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు