Shakeela : 23 ఏళ్లకే అన్నీ చూసేశా. ప్రైవేట్ లైఫ్ పై ఓపెన్ అయిన నటి షకీలా..!!

Shakeela : గతంలో ఎన్నో అడల్ట్ చిత్రాలలో నటించి..మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగింది నటి షకీలా.. ఒకానొక దశలో స్టార్ సెలబ్రెటీ గా కూడా పేరు దక్కించుకుంది. ఆ సమయంలో షకీలా సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు స్టార్ హీరోల చిత్రాలు కూడా పోస్ట్ పోన్ చేసుకునే అంతలా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్డం తగ్గడంతో పలు చిత్రాలలో కామెడీ రోల్స్ లో కూడా నటించిన ఈమె చాలా కాలం పాటూ ఇండస్ట్రీకి దూరమైంది. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన షకీలా(Shakeela) గత ఏడాది ప్రసారమైనటువంటి బిగ్ బాస్ -7 లో పాల్గొన్నది.. అక్కడ హౌస్ మేట్స్ ప్రేమాభిమానాలు పొందింది కానీ ఆడియన్స్ ని మాత్రం షకీలా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. దీంతో రెండవ వారానికే ఎలిమినేట్ అయ్యింది.

షకీలా బిగ్ బాస్ ప్రయాణం..

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను తెలియజేసింది.. బిగ్ బాస్ షో లో ఆఫర్ అంటూ కాల్ రాగానే అది ఒక ఫేక్ న్యూస్ అని వదిలేశాను.. ఆ తర్వాత నమ్మడం జరిగిందని… రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఉండాలనుకోలేదు.. ఎందుకంటే అందులో అప్పుడే గొడవలు మొదలయ్యాయి.. అమ్మగా వచ్చాను అమ్మగానే వెళ్లిపోవాలనుకున్నాను అంటూ తెలియజేసింది షకీలా(Shakeela). అలా బిగ్ బాస్ హౌస్ నుండి త్వరగా బయటికి రావడం తనకి ఎలాంటి బాధ కలిగించలేదు అని కూడా తెలిపింది.

దాదాపుగా తాను మొత్తం 400 సినిమాలలో నటించానని.. 40 పైగా సినిమాలను తెలుగులోనే నటించానని తెలిపింది.. మలయాళం, తెలుగు, తమిళ్ భాషలలో ఇప్పటికీ కూడా సినిమాలలో నటిస్తూనే ఉన్నానని వెల్లడించింది.. 1990లో తన హవా బాగా నడిచిందని.. తన సినిమా వస్తోందంటే స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేసుకునే వారంటూ తెలిపింది.. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు అయినా సరే .. ప్రతి శుక్రవారం కూడా తన నుంచి ఒక్క సినిమా అయినా అవుతుందంటూ ఖచ్చితంగా విడుదల అవుతందంటూ వెల్లడించింది.

- Advertisement -

23 ఏళ్ళకే అన్నీ చూసేసా..

కానీ తన కెరియర్ లో అడల్ట్ సినిమాలు చేయడం అనేది కేవలం తన కుటుంబం కోసమేనని.. కానీ ఇప్పుడు వాళ్లు తనతోనే లేరు అని.. డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా మనతో ఉంటారు.. ఆ తర్వాత ఉండరని తనకు తెలిసిందని తెలిపింది.. తాను తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలకి ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ తనతో తన ఫ్యామిలీ లేదనే విషయం మాత్రం ఇప్పటికి బాధగానే ఉంటుందని తెలిపింది.. 23 ఏళ్లకే అన్ని చూసేసాను.. స్టార్డం అనుభవించాను.. ఇల్లు కొన్నాను.. ఐదు కార్లు కొన్నాను.. కానీ అమ్మ అని పిలిపించుకోలేకపోయానని తెలిపింది.

అయిన వాళ్ళే దూరమయ్యారు..

తాను చాలామందిని ప్రేమించానని.. అలా ప్రేమించిన వారందరూ కూడా మోసం చేసి వాడుకొని వెళ్లిపోయారని.. తన అన్న కూడా చనిపోవడంతో కుటుంబం భారం మొత్తం తన మీద పడిందని.. వాళ్ల పిల్లలను కూడా చూసుకుంటున్నాను అంటూ తెలిపింది. ప్రస్తుతం తాను ఒక ట్రాన్స్ జెండర్ ని దత్తత తీసుకున్నానని.. వాళ్లకు కూడా పెళ్లి చేస్తున్నానని తెలిపింది.. తాను పెళ్లి చేసుకోలేకపోయాను అయినప్పటికీ వారికి తల్లిని అయ్యానని తెలిపింది షకీలా. తనకు యాంకరింగ్ చేయడం అంటే చాలా ఇష్టమని తెలుగులో సినిమాలు చేయాలని ఉందంటూ కూడా తెలియజేసింది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు