Trisha : త్రిష బాలీవుడ్ లోకి వెళ్లకపోవడానికి కారణం..?

Trisha : సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు.. ఇదిలా ఉండగా చాలామంది స్టార్ హీరోయిన్ లు సైతం సౌత్ లో బాగా పాపులారిటీ సంపాదించిన తర్వాత నార్త్ కు వెళ్లి అక్కడ ఎన్నో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.. అలాంటి వారిలో కృతిసనన్, కియారా అద్వానీ, ప్రియమణి , తాప్సీ తదితర హీరోయిన్స్ సైతం ఉన్నారు. వీరే కాకుండా చాలామంది నటీనటులు బాలీవుడ్ స్టార్స్ గా మారారు. అయితే బాలీవుడ్ లో చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ లేకపోయినప్పటికీ అక్కడే కొన్ని సినిమాలలో నటించి కొంతమంది బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.

బాలీవుడ్ లో అడుగుపెట్టని త్రిష..

అయితే ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం తెలుగు, తమిళ్ , కన్నడ చిత్రాలలో నటించి రెండు దశాబ్దాలకు పైగా సౌత్ ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్న ఒక హీరోయిన్ మాత్రం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సముఖంగా లేదన్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha)…త్రిష బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. సౌత్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం బాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాలో నటించింది.. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ కావడంతో అప్పటినుంచి మళ్ళీ బాలీవుడ్ వైపుగా అడుగులు వేయలేదు.

త్రిష నటించిన హిందీ సినిమా..

బాలీవుడ్ లో త్రిష(Trisha) నటించిన సినిమా ఏదో కాదు కట్టా మిట్టా.. 2010లో అక్షయ్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్గా ఇందులో నటించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ కామెడీ డ్రామాగా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది.. దీంతో త్రిష బాలీవుడ్ కి గుడ్ బై చెప్పిందనే వార్తలు కూడా వినిపించాయి..

- Advertisement -

బాలీవుడ్ కి అందుకే వెళ్లలేదు..

అయితే ఇటీవల కాలంలో త్రిష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముంబైకి మకాం మార్చడానికి తాను సిద్ధంగా లేనని అక్కడికి వెళ్లాలి అంటే కచ్చితంగా సౌత్ పరిశ్రమలో చాలా వాటిని విడిచి పెట్టాల్సి ఉంటుంది.. అందుకే బాలీవుడ్ వైపు తనకు వెళ్లడానికి ఇష్టం లేదని తెలియజేసింది.

హిందీలో రీమేక్ అయిన త్రిష మూవీస్..

కానీ త్రిష నటించిన ఎన్నో సినిమాలు హిందీలో రీమేక్ చేశారు.. అయితే అక్కడ భారీ విజయాలను అందుకున్నప్పటికీ ఈమె మాత్రం బాలీవుడ్ వైపుగా అడుగులు వేయడానికి ఇష్టం చూపలేదు.

త్రిష సినిమాలు..

ప్రస్తుతం త్రిష చేతిలో ఐదు సినిమాలు ఉన్నవి.. అందులో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర ఒకటి కాగా.. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం శ్రమిస్తోంది. అలాగే కమలహాసన్ హీరోగా నటిస్తున్న డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్ లైఫ్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది.. వీటితో పాటూ ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు