Trisha : ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో రివీల్

త్రిష గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన హీరోయిన్ అని అడిగితే ఇప్పటికీ చాలామంది త్రిష పేరు చెబుతారు. అంతటి ఫాలోయింగ్ ను సాధించుకుంది త్రిష. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా త్రిష కు విపరీతమైన క్రేజ్ ఉంది అనే విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. ఇకపోతే తెలుగులో సూపర్ హిట్ సినిమాలు త్రిష కెరియర్ లో ఉన్నాయి.

అలానే తమిళ్ లో కూడా సూపర్ హిట్ సినిమాలు త్రిష కెరియర్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే విజయ్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. త్రిష విజయ్ కాంబినేషన్ అంటే అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ముఖ్యంగా తమిళ్ ప్రేక్షకులకు ఆ క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. వీరిద్దరూ కలిసి రీసెంట్ గా లియో అనే సినిమాలో కనిపించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

రీసెంట్ గా వినిపిస్తున్న కథనాలు ప్రకారం త్రిష, దళపతి విజయ్ సరసన ‘G.O.A.T’ లో అతిధి పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. త్రిష ప్రస్తుతం విజయ్ తో పాటు ఒక సాంగ్ షూట్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గోట్ సినిమాలో విజయ్ హీరోగా మరియు విలన్‌గా నటిస్తున్నాడని, ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా విజయ్ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తుంది. ప్రభుదేవా, స్నేహ, మరియు అజ్మల్ అమీర్‌ వంటి నటులు ఈ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -

ఇకపోతే ఇప్పటివరకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఎక్కువ సినిమాలకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ సినిమా కి కూడా యువన్ సంగీతం అందిస్తున్నట్టు తెలిసిందే. AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ ‘G.O.A.T’ సినిమాను నిర్మిస్తుంది. చెన్నై, థాయ్‌లాండ్‌, హైదరాబాద్‌, పాండిచ్చేరి వంటి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ను జరిపారు.

ఇకపోతే ఈ సినిమాలో త్రిష కనిపిస్తుంది అనే వార్తలు నిన్నటి వరకు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి. ఇకపోతే వీటి పైన ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసింది త్రిష. రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ చూస్తే ఈ షూట్లో పాల్గొంటున్నట్టు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో త్రిష తో పాటు AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ అర్చన కల్పాతి కూడా కనిపిస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు