Prabhas : రాజాసాబ్ కి సంక్రాంతే బెస్ట్.. ఎందుకంటే!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో రాజా సాబ్ ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత తన పాత స్టైల్ లో డార్లింగ్ ప్రభాస్ గా కనిపించబోతున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లోనే కాదు కామన్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలున్నాయి. పైగా ప్రభాస్ సలార్ సినిమా సూపర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా. అయితే మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ మొదలై రెండేళ్ల పైనే అవుతున్నా సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సలార్ సినిమా వల్ల కొన్ని రోజులు రాజా సాబ్ షూటింగ్ వాయిదా పడగా, ఇప్పుడు కల్కి 2898Ad సినిమా వల్ల మరికొన్ని రోజులు వాయిదా వేసారు. అయితే తాజాగా ఈ సినిమాల గ్యాప్ లో ప్రభాస్ రాజా సాబ్ సినిమా కంప్లీట్ చేస్తూ ఉన్నాడు.

ఫైనల్ స్టేజ్ లో రాజా సాబ్..

అయితే ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి కావచ్చింది. నార్మల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండడం వల్ల ఈ సినిమా కోసం పెద్దగా సెట్టింగ్స్ కానీ, ఫైట్ సీన్లు గాని చిత్రీకరించాల్సిన అవసరం లేదని మారుతి తీరిగ్గా షూట్ చేస్తూ వస్తున్నాడు. ఇక కల్కి షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ పూర్తి కాగానే రాజా సాబ్ పై ఫుల్లుగా ఫోకస్ పెడతాడట ప్రభాస్. ప్రస్తుతం రాజా సాబ్ లో ప్రభాస్ లేని షూట్లు కొన్ని తీస్తున్నాడు మారుతి. ఇకపోతే రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ రెమ్యూనరేషనే 100 కోట్లు ఉందిట. ఇకపోతే రాజా సాబ్ రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఇంకా సరైన డేట్ కోసం వేచి చూస్తూ ఉండగా, ఈ సినిమా సంక్రాంతి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

వచ్చే సంక్రాంతికి రాజా సాబ్!

అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం రాజా సాబ్ సినిమా కూడా సంక్రాంతికి రావడమే బెస్ట్ అని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ కల్కి ఎలాగూ సమ్మర్ లో వస్తుంది. ఒకవేళ ఎలక్షన్ల వల్ల ఆ సినిమా కాస్త డిలే అయినా జూన్ లో రిలీజ్ కావడం పక్కా. ఇకపోతే రాజా సాబ్ సినిమా ఈ ఇయర్ లో రావాలంటే దసరా, లేదా దీపావళికే రావాలి. లేదా అన్ సీజన్ అయిన డిసెంబర్ లో రావాలి. కానీ దసరా, దీపావళికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు బాలయ్య, నాని, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలు ఆల్రెడీ క్యూ లో ఉన్నాయి. అందువల్ల రాజా సాబ్ సంక్రాంతికి రావడమే బెస్ట్ అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. పైగా ఫ్యామిలీస్ ఇష్టపడే సినిమా కనుక మేకర్స్ సంక్రాంతి రిలీజ్ బెస్ట్ అనుకుంటున్నారని సమాచారం. ఇటు ప్రభాస్ కూడా సంక్రాంతికి వచ్చి ఎన్నో ఏళ్లయింది. అయితే ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయ్యాకే ఈ సినిమా రిలీజ్ అవుతుందనేది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు