Raaja Saab: సంక్రాంతికి మరో మాస్ ఎంటర్టైనర్

2012లో రిలీజ్ అయిన ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారుతి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక చిన్న సినిమాగా వచ్చి పెద్ద సంచలనాన్ని సృష్టించింది ఈ రోజుల్లో అనే సినిమా. ఆ సినిమా తర్వాత అదే సంవత్సరంలో బస్ స్టాప్ అనే మరో సినిమాని తెరకెక్కించాడు మారుతి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

ఆ తర్వాత మారుతి రాసిన సినిమా ప్రేమ కథ చిత్రం. ఈ సినిమా హర్రర్ కామెడీ గా ప్రేక్షకులు ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో మారుతి స్థాయి ఇంకొంత పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత 2014లో కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు మారుతి. అయితే అదే ఇయర్లో అల్లు శిరీష్ తో చేసిన కొత్తజంట సినిమాతో మళ్లీ మంచి హిట్ అందుకున్నాడు మారుతి.

ఇకపోతే ఈ రోజుల్లో సినిమాతో తన జర్నీని స్టార్ట్ చేసిన మారుతి భలే భలే మగాడివోయ్ సినిమాతో తన పంథాను మార్చుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఫ్యామిలీస్ అందరూ చూడగలిగే సినిమాలను మాత్రమే దర్శకత్వం వహించాడు. నాని కెరియర్ లో భలే భలే మగాడివే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చేసిన బాబు బంగారం, మహానుభావుడు, శైలజ రెడ్డి అల్లుడు ఇటువంటి సినిమాలు అన్నిటితో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు మారుతి.

- Advertisement -

సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన ప్రతిరోజు పండగే సినిమా మారుతి కెరియర్ లో మంచి హిట్ అయింది. ఆ సినిమా కేవలం మారుతికి మాత్రమే కాకుండా సాయి ధరంతేజ్ కూడా పెద్ద ప్లస్ అయింది. ఆ సినిమా తర్వాత మంచి రోజులు వచ్చాయి అనే సినిమాని చేశాడు మారుతి. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే మారుతి లాస్ట్ గా దర్శకత్వం వహించిన సినిమా పక్క కమర్షియల్ ఈ సినిమా కూడా సేఫ్ జోన్ అని చెప్పొచ్చు.

ఇప్పటివరకు మారుతి చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది తప్ప ఏది డిజాస్టర్ అని అనిపించుకోలేదు. అంత కేర్ఫుల్ గా ఒక సినిమాను తెరకెక్కిస్తాడు మారుతి. అయితే ఇప్పుడు మారుతి చేస్తున్న సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మారుతి ఇప్పుడు చేస్తున్నది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లోని ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చూసి చాలా రోజులైంది. ఆ యాంగిల్ ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి.

అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం జూన్ మంత్ లో డేట్స్ ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది. ఐతే అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. ఇకపోతే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సినిమాలతో కూడా రెడీగా ఉన్నారు. మారుతి చేస్తున్న ఈ సినిమాకి రాజా సాబ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు దీని ఫస్ట్ లుక్ ని కూడా ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు