Kalki2898AD : కల్కి వాయిదా కన్ఫర్మ్ చేసిన విశ్వక్?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా పై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయని తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నారు. 500 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మైథలాజికల్ టచ్ తో ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమా పై ఓ రేంజ్ హైప్ ని పెంచేసాయి. అన్నిటికి మించి నాగ్ అశ్విన్ డైరెక్షన్ అఫ్ విజన్ పై ఆడియన్స్ కి టాలీవుడ్ ఆడియన్స్ కి గట్టి నమ్మకం ఉంది. దానికి నాగ్ అశ్విన్ ఇంతకు ముందు తీసిన సినిమాలే కారణం. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా రోజులుగా జరుగుతూ వస్తున్నా ఇంకా పూర్తవలేదు.

కల్కి వాయిదా కంఫర్మ్?

అయితే కల్కి సినిమా వాయిదా పడుతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. దానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ టైం కి పూర్తి కాలేదు. ఇంకా గ్రాఫిక్స్ వర్క్ చాలా పెండింగ్ లో ఉందని కొందరు అంటుంటే, మరి కొందరు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల హడావిడి ఉన్నందున కల్కి వాయిదా తప్పదని అంటున్నారు. అన్నిటికి మించి కల్కి మే 9కి ప్రకటించినట్టు అదే డేట్ కి రావాలంటే మేకర్స్ ఎప్పుడో ప్రమోషన్లు స్టార్ట్ చేసి ఉండాలి. అసలే పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్లు ఎంత పగడ్బంది గా చేయాలో తెలిసిందే. ముఖ్యంగా హిందీలో అయితే నెల రోజుల ముందు నుండే హడావిడి చేయాల్సి ఉంటుంది. దీనికి అంత టైం లేదు కాబట్టే కల్కి ని వాయిదా వేస్తున్నారని సమాచారం. అయితే మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు గాని, కల్కి వాయిదా ని ఆల్మోస్ట్ కంఫర్మ్ చేస్తూ విశ్వక్ సేన్ తన సినిమాతో హింట్ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

గ్యాంగ్స్ అఫ్ గోదావరి మే 17న..

అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD సినిమా మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడిందని వస్తున్న వార్తలకి నిజం చేస్తున్నట్టుగా తాజాగా విశ్వక్ సేన్ తన సినిమాతో హింట్ ఇచ్చాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన కొత్త సినిమా గ్యాంగ్స్ ఆప్ గోదావరి సినిమా మార్చి 8న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. మే 17న గ్యాంగ్స్ అఫ్ గోదావరి ని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి2898AD మే9న రిలీజ్ కావాల్సి ఉండగా దానికి వారం రోజుల గ్యాప్ తో విశ్వక్ తన సినిమాతో పాన్ ఇండియా మూవీ కి పోటీగా వచ్చే ధైర్యం చేయడు. కానీ తన సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించాడంటే ప్రభాస్ కల్కి2898AD ఖచ్చితంగా వాయిదా పడిందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చిత్ర నిర్మాతలు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు