Nikhil : కార్తికేయ3 రాకకి సిద్ధం..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్ తో పరిచయమైన ఈ హీరో ఆ సినిమాలో సెకండ్ లీడ్ అయినా కూడా అందరికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించాడు ఈ సినిమాతో. ఆ తర్వాత వరుస బెట్టి హీరోగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. యువత స్వామి రారా, వంటి సినిమాలతో సక్సెస్ కూడా సాధించాడు. అయితే నిఖిల్ కి కెరీర్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం కార్తికేయ అని చెప్పాలి. చిన్న డివోషనల్ రిఫరెన్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు పదేళ్ల కింద చందు మొండేటి దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నిఖిల్ వెనుదిరిగి చూసుకోలేదు. ఇక ఆ తర్వాత రెండేళ్ల కిందట కార్తికేయ కి సీక్వెల్ తో మళ్ళీ వచ్చారు.

కార్తికేయ2 ప్రభంజనం..

నిఖిల్ చందు మొండేటి కాంబినేషన్ లో మళ్ళీ కార్తికేయ 2 కూడా రావడం జరిగింది. ఆ సినిమా మొదటి దాన్ని మించి పది రెట్లు ఘన విజయం సాధించిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయగా అక్కడ చిన్నగా రిలీజ్ అయ్యి మౌత్ టాక్ తో సంచలన విజయం సాధించింది. కార్తికేయ 2 ప్రపంచా వ్యాప్తంగా దాదాపు 140 కోట్లకి పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా డివోషనల్ టచ్ తో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్. కార్తికేయ ఫస్ట్ పార్ట్ కుమార స్వామి గుడి కథ నేపథ్యంలో సాగుతుండగా, కార్తికేయ2 శ్రీ కృష్ణుడి నేపథ్యంలో సాగుతుంది. శ్రీ కృష్ణుడి కాలి కంకణం గురించి సాగే ఈ ఫిక్షనల్ డ్రామాలో థ్రిల్లింగ్ అంశాలు బాగా ఉండగా, కృష్ణుడి గురించి చెప్పే రిఫరెన్స్ లు ఆడియన్స్ కి మంచి అనుభూతి ని అందించాయి. ఇక ఇప్పుడు కార్తికేయ 3 కి రంగం సిద్ధమైంది.

- Advertisement -

కార్తికేయ 3 త్వరలో..

తాజాగా నిఖిల్ చందు మొండేటి హ్యాట్రిక్ కాంబోలో కార్తికేయ 3 రాబోతుంది. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా తన ట్విట్టర్ పేజీలో అనౌన్స్ చేసాడు. డాక్టర్ కార్తికేయ న్యూ అడ్వెంచర్ తో త్వరలో మళ్ళీ ముందుకు వస్తున్నాడు అంటూ అనౌన్స్ చేసాడు. ఇక సెకండ్ పార్ట్ లో కార్తికేయ ఒక తాళం చెవితో వియాత్నం సముద్ర తీరం దగ్గర ఉన్నట్టు చూపించి ఎండ్ చేస్తారు. దాదాపు కార్తికేయ మూడో భాగం బహుశా అక్కడి నుండే మొదలవ్వొచ్చు. అయితే క్యాస్టింగ్ వేరే వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. ఇక కార్తికేయ2 పాన్ ఇండియా వైడ్ గా బ్లక్ బస్టర్ అవడం వల్ల సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా నిర్మించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. వచ్చిన సమాచారం ప్రకారం కార్తికేయ3 ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. దీని పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు