Ajith : ట్విట్టర్ లో అజిత్ మూవీ టైటిల్ సెన్సేషన్..

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ్ లో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ దక్కించుకున్న నటుల్లో ఒకరు. ఫ్యాన్స్ అందరూ థలా అని పిలుచుకునే అజిత్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ నెలల ముందు రచ్చ కి రెడీ అయి ఉంటారు. తమిళ్ నాడు లో అజిత్ మూవీ విజయ్ మూవీ పోటీ గా వచ్చిందంటే ఇక అక్కడ జరిగే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్ప్పనక్కర్లేదు. అయితే గత కొన్నేళ్లుగా అజిత్ నుండి మాత్రం సరైన సినిమా రావడం లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్లకి కేరాఫ్ గా ఉండే అజిత్ తన రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా ఏళ్లయింది. ఇక లాస్ట్ ఇయర్ తునివు తో మంచి సక్సెస్ కొట్టినా అది అజిత్ రేంజ్ కి పడాల్సిన మూవీ కాదు. ఇక ఇప్పుడు అజిత్ నుండి మరో భారీ చిత్రం రాబోతుంది.

మైత్రి నిర్మాణంలో..

అజిత్ హీరోగా నటించబోయే ఈ కొత్త సినిమా పేరు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పేరుతో తెరకెక్కిస్తుండగా, ఈ ఏడాది జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమా కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. అయితే మైత్రి మూవీ మేకర్స్ గురువారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ ట్విట్టర్ లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ అనౌన్స్ మెంట్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది.

- Advertisement -

ట్విట్టర్ లో రికార్డ్..

థలా అజిత్ హీరోగా నటిస్తున్న ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ వేయగా ఆ అనౌన్స్ మెంట్ కి ట్విట్టర్ రికార్డులు షేక్ అయ్యాయి. చూస్తూ చూస్తూ ఏకంగా అజిత్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది. టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ కి 24 గంటల్లో ఏకంగా 27.2 మిలియన్ల వ్యూస్ తో ఆల్ టైం టైటిల్ అనౌన్స్ మెంట్ వ్యూస్ దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక టైటిల్ అనౌన్స్ మెంట్ కే ఇంత రచ్చ జరిగితే ముందు ముందు ఈ సినిమాతో ఇంకెంత రచ్చ జరుగుద్దో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కోసం పని చేసే సాంకేతిక నిపుణులను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. విజయ్ వేలుకుట్టి ఎటిటర్ గా, సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్ స్టంట్స్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఇక అజిత్ చివరగా తునివు సినిమాలో నటించగా, గతేడాది పొంగల్ కు ఆ సినిమాతో వచ్చి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి మూవీలో నటిస్తున్నాడు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు