Trisha : త్రిష డబుల్ బొనాంజా… “విశ్వంభర”లో ఇదేనట ట్విస్ట్

చెన్నై చిన్నది త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోలతో జతకడుతూ దుమ్ము రేపుతోంది. వరస ఆఫర్స్ తో తోటి హీరోయిన్లకు అసూయ కలిగేలా చేస్తుంది. ఆమె అభిమానులు పండగ చేసుకునే వార్త ఒకటి తాజాగా తెలుగు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. “విశ్వంభర” నుంచి లేటెస్ట్ గా బయటకు వచ్చిన ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

“విశ్వంభర”లో హీరోయిన్ గా…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ మూవీని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. “విశ్వంభర”లో త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పటికే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇటీవల “విశ్వంభర” సెట్స్ లో చేరిన త్రిష, ప్రస్తుతం మూవీ షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేస్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి, త్రిష కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై రిపీట్ కాబోతున్న తరుణంలో ఈ మూవీ విషయంలో మెగా ఫాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలో త్రిష పాత్ర గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

త్రిష డబుల్ బోనాంజా…
“విశ్వంభర” మూవీలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తుందనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా హీరోలు ఎక్కువగా డ్యూయల్ రోల్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్లు చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు చేస్తారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రమే వాళ్లకు డ్యూయల్ రోల్ చేసే అవకాశం దక్కుతుంది. కానీ త్రిషకు మాత్రం మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ ను ప్రూవ్ చేసే అద్భుతమైన అవకాశం “విశ్వంభర” ద్వారా దక్కుతోందని అంటున్నారు. కాగా ఈ సినిమాలో త్రిష ఒక పాత్రలో సాధారణ అమ్మాయిగా కనిపించనుందట. మరో పాత్ర విషయానికి వస్తే “విశ్వంభర”లో ఆమె దేవతగా నటిస్తోందని అంటున్నారు. ఆమె పోషిస్తున్న రెండవ పాత్ర ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్ అని సమాచారం.

- Advertisement -

యంగ్ హీరోయిన్లకు “విశ్వంభర”లో ఛాన్స్…
ఇక “విశ్వంభర” మూవీలో త్రిష మెయిన్ లీడ్ గా నటిస్తుంటే, మీనాక్షి చౌదరి గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. త్రిష, మీనాక్షి చౌదరి తప్ప మిగతా వారంతా సినిమాలో చిరు సిస్టర్స్ గా దర్శనం ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ముల్లోకాల కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో మెగాస్టార్ భీమవరం దొరబాబుగా కనిపించబోతున్నారు.

త్రిష నెక్స్ట్ మూవీస్…
త్రిష “విశ్వంభర”తో పాటు వెంకటేష్ నెక్స్ట్ మూవీలో కూడా మెయిన్ లీడ్ చేయనుంది. విడా ముయార్చి, రామ్, ఐడెంటిటీ, తగ్ లైఫ్ అనే సినిమాల్లో ఈ చెన్నై చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తోంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు