Life style : ఫిట్ గా, హెల్డిగా ఉండాలా? మీ లైఫ్ స్టైల్ లో ఈ చిన్న చేంజెస్ చేస్తే చాలు

లైఫ్ స్టైల్ అనేది ఆరోగ్యం పై స్ట్రాంగ్ ఎఫెక్ట్ చూపిస్తుందన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. నేటి డిజిటల్ యుగంలో బిజీ షెడ్యూల్ కారణంగా ప్రజలు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వడం రోజురోజుకు కష్టతరం అవుతోంది. వ్యాయామం చేయాలనుకున్నా టైం దొరకదు. దీంతో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. సాధారణంగా ఫిట్ గా, హెల్దిగా ఉండే వ్యక్తులు అంత ఈజీగా జబ్బు పడరు. ఎందుకంటే వాళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అంత త్వరగా లావుగా కూడా అవ్వరు. బలంగా ఉంటారు. అందుకే చాలామంది ఫిట్ గా కనిపించాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఫిట్ గా ఉండాలంటే చాలా కష్టమైన నియమాలు, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వాలేమో అనుకుంటారు మనలో చాలామంది. అది నిజం కాదు. మిమ్మల్ని ఫిట్ గా మార్చే లైఫ్ స్టైల్ లేదా రూల్స్ అనేవి ప్రత్యేకంగా ఏమీ లేవు. కానీ మీ లైఫ్ స్టైల్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండగలుగుతారు. మరి ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోండి

Fitness Tips
ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో జనాలు ఎక్కువ సమయం కూర్చోవలసి వస్తుంది. కాస్త సమయం దొరికితే పడుకోవడానికి చూస్తారు. అయితే దీనివల్ల తెలియకుండానే శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అలా జరగకూడదు అంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయలేనివారు కాసేపు వాకింగ్ చేస్తే ఫిట్ గా ఉంటారు. అలాగే ఎక్కువసేపు ఒకే విధంగా కూర్చోవడం వంటివి చేయకుండా ప్రతిరోజు కనీసం అరగంట పాటు నడిస్తే చాలు. అవుట్ డోర్ గేమ్స్, లిఫ్ట్ కు బదులు మెట్లను వాడడం వల్ల కూడా ఫిట్ గా ఉంటారు.

- Advertisement -

2. నిద్ర

Fitness Tips
ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి నిద్ర కూడా అవసరం. కాబట్టి రోజుకు తప్పనిసరిగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం ముఖ్యం. రాత్రి సమయానికి నిద్రపోయి, ఉదయాన్నే లేవడానికి ట్రై చేయండి. బాగా నిద్రపోతే శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. హాయిగా నిద్రపడితే తెల్లవారుజామునే కొంచెం తొందరగా లేవగలుగుతాం. దీనివల్ల ఉదయాన్నే కాసేపు వ్యాయామం, ధ్యానం వంటివి చేసే అవకాశం దొరుకుతుంది. అలాగే బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయడానికి కావాల్సినంత టైం దొరుకుతుంది.

3. ఆహారం

Fitness Tips
హెల్దీ ఫుడ్ తీసుకొనే వారు ఫిట్ గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఫిట్ గా ఉండే వ్యక్తులు ప్రత్యేకంగా అదే తినాలి ఇదే తినాలి అని రూల్స్ ఏమి పెట్టుకోరు. అన్ని తింటారు.. కాకపోతే మితంగా తింటారు. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరగదు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. అతిగా తింటే ఏదైనా అనర్థమే. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ చేయడం మర్చిపోవద్దు.

4. వాటర్

Fitness Tips
మన శరీరానికి వాటర్ ఎంత అవసరమో అందరికీ తెలుసు. ప్రతిరోజు తగినంతగా వాటర్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఇక తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తాయి. అంతేకాకుండా అతిగా తినలేరు. ఫలితంగా ఫిట్ గా ఉంటారు.

5. మానసిక ఆరోగ్యం

Fitness Tips
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం ఇంపార్టెంట్. నేటి లైఫ్ స్టైల్ లో ఒత్తిడి సర్వసాధారణం అవుతుంది. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి మైండ్ ఫుల్ నెస్ ప్రాక్టీస్ చేయడం, మెడిటేషన్ లాంటివి చేయవచ్చు. ఈ అలవాట్లను రెగ్యులర్ గా ఫాలో అయితేనే ఫలితం

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు