Relationship Tips: తెలివైన వాళ్ళు రిలేషన్షిప్ లో పొరపాటున కూడా ఈ తప్పులు చేయరు

మనమందరం తెలివిగా, మెచ్యూర్ గా ఉండాలని కోరుకుంటాము. కానీ రిలేషన్షిప్స్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన వాళ్లపై సరైన శ్రద్ధ చూపించకుండా నిర్లక్ష్యం చేస్తాము. పైగా కొన్ని అనవసరమైన కామెంట్స్ చేసి ఆ తర్వాత బాధపడతారు. అయితే చాలామంది రిలేషన్షిప్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడానికి కలుగుతున్న ఆటంకాలు ఏంటో గుర్తించలేరు. కానీ తెలివైన, మెచ్యూర్డ్ వ్యక్తులు రిలేషన్షిప్ లో కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయరు. మరి అవేంటి అంటే….

1. కంక్లూజన్
లవర్ పట్టించుకోవట్లేదని గొడవపడి చాలామంది ఒక కంక్లూజన్ కి వచ్చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. తిరిగి కాల్ చేయలేదని, లేదా అనుకున్న సమయానికి మీ చెంతకు చేరలేదని కోపంలో ఏదైనా అనే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారనీ లేదా ఇంకేదైనా ముఖ్యమైన పనిలో ఉన్నారనే విషయం తెలిస్తే ముఖం చెల్లదు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. కాబట్టి అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా ఒక కంక్లూజన్ కి వచ్చేయడం అనేది తెలివి తక్కువ పని అనే విషయం మెచ్యూర్ పర్సన్స్ బాగా అర్థం చేసుకుంటారు. అందుకే ఊహించే బదులు అపార్ధాలను ముందుగా చర్చించి అంతం చేస్తారు. రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ కీలకమని వాళ్లకు తెలుసు.

2. టిట్ ఫర్ టాట్
కొంతమంది తమ పార్ట్నర్ ఏదైనా తప్పు చేస్తే, తాము కూడా అలాంటి తప్పే చేసి ప్రతీకారం తీర్చుకుంటారు. అంటే అది తప్పు అని తెలిసిన తర్వాత కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు చేసిన తప్పు ఎంత తెలివి తక్కువ పనో అర్థమవుతుంది. రిలేషన్ షిప్స్ అనేవి సమానంగా తప్పులు చేయడం, లేదా వాళ్ల తప్పు ఏంటో తెలిసేలా చేయడం కోసం మరో తప్పు చేయడం కాదు. ఇద్దరూ ఒకరినొకరు క్షమించడం, అర్థం చేసుకోవడం, ఆనందంగా ఉండడమే రిలేషన్ షిప్ కు అసలైన అర్థం

- Advertisement -

3. అవసరాలను పట్టించుకోకపోవడం
లవర్ ను సంతోష పెట్టాలని కోరుకోవడం సహజమే. కానీ మెచ్యూర్డ్ వ్యక్తులు సెల్ఫ్ కేర్ ఇంపార్టెన్స్ ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే సొంత అవసరం తీర్చుకోవడం అనేది స్వార్థం కాదు. పైగా హెల్దీ రిలేషన్ షిప్ కు సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యం అనే విషయం వాళ్లకు తెలుసు కాబట్టి. సొంత అవసరాలను పక్కన పెట్టేసి లవర్స్ కు మొదటి స్థానం ఇచ్చే వ్యక్తులకు తక్కువ ఆత్మగౌరవం ఉంటుంది. అలాగే రిలేషన్ షిప్ లో అసంతృప్తిగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సొంత అవసరాలను చూసుకోవడం కూడా ముఖ్యమైన విషయామని గుర్తుపెట్టుకోండి.

4. సారీ చెప్పడానికి నిరాకరించడం
ఇష్టమైన వ్యక్తితో గొడవ పడినప్పుడు టెన్షన్ ఎక్కువై పరుష పదజాలం వాడతారు. ఇష్టం వచ్చినట్టుగా తిడతారు. ఆ తర్వాత తప్పు చేశామని గ్రహించినప్పటికీ, సారీ చెప్పడానికి ఇష్టపడరు. కానీ మెచ్యూర్డ్ అండ్ వైజ్ పీపుల్ క్షమాపణకు ఉన్న శక్తిని అర్థం చేసుకుంటారు. వాళ్లు తప్పును అంగీకరించడం మాత్రమే కాదు, రిలేషన్షిప్ కు విలువని ఇస్తారు. బ్రేక్ అయిన రిలేషన్ ను చక్కదిద్దడానికి, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికి ఉపయోగించే శక్తివంతమైన సాధనమే సారీ. ఎందుకంటే ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, క్షమించడం, సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు క్షమించమని అడగడం కూడా.

5. పగ
సాధారణంగా ఎవరిపైనైనా పగ పెంచుకోవడం అంటే మనం మన మనశ్శాంతిని మనమే దూరం చేసుకోవడం అన్నమాట. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. అవతలి వ్యక్తి చేసింది అన్యాయం అని తెలిసినప్పటికీ అతను చేసిన పనిbకంటే మీరు పెంచుకుంటున్న పగే ఎక్కువగా హాని చేస్తుంది. కాబట్టి తెలివైన, మెచ్యూర్డ్ వ్యక్తులు తమ పట్ల అన్యాయంగా వ్యవహరించిన వ్యక్తులను క్షమించేసి, ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు.

6. పారిపోవడం కరెక్ట్ కాదు…
రిలేషన్ షిప్ లో ఏదైనా కఠినమైన సమస్య ఎదురైనప్పుడు ఇంటికి ఆలస్యంగా రావడం వంటివి చేస్తారు. దీనివల్ల అపార్థం పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి ఆ సమస్య నుంచి పారిపోకుండా నేరుగా ఎదుర్కోవడమే బెటర్ అని తెలివైన వ్యక్తులకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ కు విలువ ఇస్తారు.

7. ఇతరులతో పోలిక
ప్రతి రిలేషన్ షిప్ లో ఎత్తు పల్లాలు అనేవి సహజం. కాబట్టి ఇతరులతో పోల్చుకోవడానికి బదులు తమ రిలేషన్ ను మరింత బెస్ట్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

8. మార్పు
లవర్ లేదా పార్ట్నర్ ను మార్చడానికి ప్రయత్నించడం అనేది వ్యర్థం మాత్రమే కాదు, రిలేషన్షిప్ కు హానికరం కూడా. ప్రపంచంలో ఏ వ్యక్తి పర్ఫెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది. కాబట్టి తెలివైన వ్యక్తులు తమ భాగస్వామిని మార్చడానికి బదులు వారిని వారుగా అంగీకరించి, సంతోషంగా ఉంటారు. ఇవన్నీ మెచ్యూర్ అండ్ తెలివైన వ్యక్తులు చేసే పనులు. మరి మీ సంగతేంటి?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు