Singer Rihanna: రిహన్నకు చెవులు వినిపించవా? మరీ అంబానీ వెడ్డింగ్‌ని ఎలా మ్యానేజ్ చేసింది

అనంత్ అంబానీ వెడ్డింగ్ వేడుకల్లో ఇంటర్నేషనల్ పాప్ సింగర్ రిహన్న స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో రిహాన్నను చూసి అంబానీ అంటే మజాకా, ఆహా ఓహో అనుకున్నారు అంతా. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక పిక్ చూశాక రిహాన్నాకు చెవులు వినిపించవా? మరి ఆమె అంబానీ వేడుకను ఎలా మేనేజ్ చేసింది? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఇంతకీ అసలు కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

అనంత్ అంబానీ వేడుకలో రిహాన్న…
దేశంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చ్ 1 నుంచి 3 వరకు గుజరాత్ లోని జామ్ నగర్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు దేశవిదేశాల ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ మొత్తం అక్కడే సందడి చేసింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అంబానీ వేడుకకు హాజరయ్యే అవకాశం లభించింది. ఇక అనంత్ అంబానీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మరో సెలబ్రిటీ. పాపులర్ బార్బేడియన్ సింగర్ రిహాన్న స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సెంటరాఫ్ ఇంటరాక్షన్ గా నిలిచింది.

రిహాన్నకు షాకింగ్ రెమ్యూనరేషన్…
అనంత్ అంబానీ పెళ్ళిలో పర్ఫామ్ చెయ్యడానికి రిహన్నకు ముఖేష్ అంబానీ గట్టిగానే ముట్టజెప్పాడు అనే ప్రచారం నడిచింది. ఆమెకు పారితోషికంగా 50 లక్షల పౌండ్లు అనే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 52 కోట్లు. ఇది ఇండియాలోని స్టార్ హీరోలు ఒక్క సినిమాకు అందుకునే రెమ్యూనరేషన్. ఇక పారితోషికం విషయంలో బాలీవుడ్ స్టార్స్ ను రిహన్నను ముందు తక్కువ చేశారని విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ అంతా డబ్బు కోసమే ఆ వేడుకకు వెళ్లారని వార్తలు వచ్చాయి.

- Advertisement -

రిహాన్నకు చెవులు వినిపించవా?…
తాజాగా రిహన్నకు సంబంధించిన ఒక పిక్ వైరల్ అవుతుండగా, దాన్ని చూశాక రిహన్నకు చెవుడు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిజానికి ఆమెకు చెవుడు లేదు. అంబానీ ఇంట్లో జరిగిన ఈవెంట్ కు మాత్రం రిహాన్న పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదని టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఆమె సాధారణంగా చేసే షోల కంటే కూడా అంబానీ ఈవెంట్ లో దారుణంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని కూడా సరిగ్గా పర్ఫామ్ చెయ్యలేదని దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా వైరల్ అవుతున్న పిక్ లో రిహన్నను కాస్త గమనిస్తే సాంగ్స్ వినిపించడానికి ఆమె చెవిలో ఇయర్ హెడ్ లాంటిది కనిపిస్తోంది. రిహాన్నను అలా చూశాక ఆమె ఎట్లీస్ట్ సాంగ్స్ కూడా ప్రిపేర్ కాలేదని, చెవిటి దానిలా హెడ్ సెట్ పెట్టుకుని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మ్యానేజ్ చేసింది అంటూ మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

లగేజీ ట్రోలింగ్…
ఇప్పుడేమో రిహాన్న పర్ఫామెన్స్ పై విమర్శలు వస్తుంటే… ఈవెంట్ కు ఇండియాకు వచ్చిన సమయంలో లగేజీ విషయంలో రిహాన్న ట్రోలింగ్ కు గురైంది. ఎయిర్ పోర్టు నుంచి పెళ్లి వేదికకు ఆమె లగేజిని మోసుకుపోవడానికి ఒక ట్రక్కు సరిపోలేదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు